Koppula Eshwar: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ 18 వేల కోట్లు ప్రజలకు పంచిస్తాడా ?

Minister Koppula Eshwar: టీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు ఉందని.. తాము డబ్బుతో రాజకీయాలు చేసే వాళ్ళం కాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్.. బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

Written by - Pavan | Last Updated : Oct 17, 2022, 09:01 PM IST
  • దళితులపై దాడులు పెరిగాయన్న మంత్రి కొప్పుల ఈశ్వర్
  • డబ్బులతో ఓట్లు కొనలేరని మండిపాటు
  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక్క ఓటు కూడా వేయవద్దని విజ్ఞప్తి
Koppula Eshwar: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ 18 వేల కోట్లు ప్రజలకు పంచిస్తాడా ?

Minister Koppula Eshwar: మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తోన్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా చండూరు మండలం బోడంగిపర్తిలో ప్రచారం నిర్వహించిన మంత్రి కొప్పుల ఈశ్వర్.. నేలపై కూర్చొని గ్రామస్తులు చెప్పిన సమస్యలు విన్న మంత్రి కొప్పుల ఈశ్వర్.. డబ్బులతో ఓట్లు కొనుకోవచ్చని భావించే వారిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా నేలపై కూర్చుని ప్రజల సమస్యలు విన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. బీజేపీ అంటేనే ఎస్సీ, బిసి వర్గాల వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. 

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాకా దేశంలో దళితులపై దాడులు పెరిగాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకోకముందు గత పాలకులు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న నల్గొండ జిల్లాను పట్టిచుకుకోలేదని.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత వెంటనే ఫ్లోరైడ్ రహిత నీటిని అందించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మిషన్ భగీరథ పథకం ద్వారా ఇక్కడి ప్రజలకు ఫ్లోరైడ్ రహిత మంచి నీటిని అందించారని గుర్తుచేశారు. 

మునుగోడులో ఉప ఎన్నిక రావడానికి కారణం ఎవరు, ఏంటనే విషయం ఇక్కడి ప్రజలకు పూర్తిగా అర్థం అయింది. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, ఎవరి కోసం చేయాల్సి వచ్చిందో ప్రజలే నిలదీయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి, బీజేపిలో చేరి తెచ్చుకున్న 18 వేల కోట్ల రూపాయలు ప్రజలకు పంచిస్తాడా అని ప్రశ్నించారు. అందుకే మునుగోడు ప్రజలు ఒక్క ఓటు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వేయవద్దని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశాకా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR ) ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోని నిరుపేదలు, మరీ ముఖ్యంగా దళిత వర్గాలకు చెందిన విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ కేసీఆర్ ప్రభుత్వాన్ని కొనియాడారు.

Also Read : KCR iIlness: కేసీఆర్ కు అస్వస్థత.. హుటాహుటిన ఢిల్లీకి అధికారులు.. అసలు ఏమైందంటే?

Also Read : Komatireddy Venkat Reddy: ఎస్పీ రేంజ్ నేతలుండగా.. హోంగార్డు ఎందుకు! మునుగోడు ప్రచారంపై వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్

Also Read : AICC President Election: గాంధీ భవన్ లో 45 ఇండస్ట్రీ లీడర్ గోల... అధ్యక్ష ఎన్నికల పోలింగ్ లో రచ్చ

Also Read : Munugode ByPoll: కోమటిరెడ్డి రాజీనామాతో జరిగిన మేలు ఇదే! మునుగోడులో ఫ్లెక్సీల కలకలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News