Narendra Modi 48 Hours Yoga: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనకు వెళ్లారు. కన్యాకుమారిలోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్‌లో 48 గంటల పాటు యోగా చేయనున్నారు. ఈ మేరకు అక్కడ భారీ ఏర్పాట్లు జరిగాయి.
7th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలను.. భారత ఎన్నికల కమిషన్ 7 విడతల్లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా నేటి సాయంత్రంతో చివరి దశ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తోన్న వారణాసి స్థానంతో పాటు 57 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Narendra Modi Hotel Bill Stay In Mysuru Hotel: ఇతర ప్రాంత పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ బస చేసిన హోటల్ అద్దె విషయమై వివాదం సద్దుమణిగింది. హోటల్ అద్దె చెల్లించడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
AP Assembly Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి బరిలో దిగింది. ఏపీలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోపాటు జాతీయ పార్టీ కాంగ్రెస్‌లు నామ మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూటమి తరుపున ఎన్నికల బరిలో దిగింది. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఇపుడు పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున పందెం కాస్తున్నారు.
EC Rejected Nomination Shyam Rangeela Who Contested Against Narendra Modi In Varanasi: పదేళ్ల పాలనను విమర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్‌కు భారీ షాక్ తగిలింది. అతడి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
Kishan Reddy Hopes BJP Getting Majority MP Seats In Telangana: తమపై రేవంత్ రెడ్డి చేసిన దుష్ప్రచారం చూసి ప్రజలు నవ్వుకున్నారని.. ప్రజలంతా నరేంద్ర మోదీకే అండగా నిలిచారని.. అత్యధిక స్థానాలు సాధిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
Narendra Modi Assets Here Affidavit Details: లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. వారణాసి నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆయన ఆస్తులు రూ.3 కోట్లు ఉన్నాయి. గతం కంటే కొంత పెరగడం విశేషం.
Narendra Modi Filed Nomination From Varanasi: మూడోసారి ప్రధానమంత్రి పీఠం అధిరోహించడానికి మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. తన సిట్టింగ్ స్థానం వారణాసి నుంచి మరోసారి పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం కలెక్టర్ కార్యాలయంలో మోదీ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే పక్షాలు హాజరవగా.. ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెళ్లారు.
ప్రస్తుత ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని.. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మరోసారి ఆరోపించారు. తెలంగాణ వికాసం కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డీకే అరుణను మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Narendra Modi Vemulawada Temple: దక్షిణ కాశీగా ప్రఖ్యాతి గాంచిన వేములవాడ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటించిన ఆయన కరీంనగర్ ప్రచార సభకు వెళ్లేముందు బుధవారం ఉదయం వేములవాడకు చేరుకున్నారు. ఆలయంలో కోడె మొక్కులు చెల్లించిన అనంతరం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రధానికి ప్రత్యేక స్వాగతం పలికారు.
YS Sharmila Radio Gift To Narendra Modi: ఎన్నికల నేపథ్యంలో విస్తృత ప్రచారం చేస్తూనే సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ పాలనలో ఏపీకి అన్యాయం జరిగిందని అసహనం వ్యక్తం చేసిన షర్మిల ఈ సందర్భంగా మోదీకి టేప్ రికార్డర్/ రేడియోను గిఫ్ట్‌గా పంపారు.
Narendra Modi Telangana Election Rally In Vemulawada And Warangal: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో మరోసారి పర్యటించారు. వేములవాడ, వరంగల్ సభల్లో మోదీ పాల్గొని సంచలన ప్రసంగం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు చేశారు.
Sonia Gandhi Call To Public Amid Lok Sabha Elections: అధికారానికి దూరమై దశాబ్దం గడిచిన వేళ జరుగుతున్న ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దేశ ప్రజలకు విలువైన భావోద్వేగకరమైన సందేశం ఇచ్చారు.
Narendra Modi Slams On YSRCP In Election Campaign: అధికార వైఎస్సార్సీపీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని.. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే వికసిత్ ఏపీ సాధ్యమని ప్రకటించారు.
Rahul Gandhi Telangana Poll Rally In Nirmal: రిజర్వేషన్ల అంశంపై మరోసారి ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. తాము రిజర్వేషన్లు పెంచుతామంటే మోదీ రద్దు చేయాలని చూస్తున్నాడని.. ఈ సందర్భంగా మోదీకి రాహుల్ సవాల్ విసిరారు.
Supreme Court: సాధారణంగా ఎన్నికల్లో ఒక పెద్ద పార్టీ నుంచి పోటీ చేస్తోన్న వ్యక్తి పేరుతో పలువురు ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. ఓటర్లను కన్ఫ్యూజన్ చేసేందుకు ఈ ఎత్తుగడను అనుసరిస్తూ ఉంటారు. ప్రత్యర్ధి పార్టీ వ్యక్తులే ఇలా ఆయా అభ్యర్ధులను ఎన్నికల బరిలో దింపుతుంటారు. తాజాగా దీనిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Don't Fear Don't Go PM Modi Reacts On Rahul Raebareli Contest: లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ స్థానం మారడంపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ, రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Revanth Reddy Repeated Reservations Ban In Asifabad: పదేళ్లు పరిపాలించిన నరేంద్ర మోదీ తెలంగాణకు ఏం ఇవ్వలేదని.. ఒక్క గాడిద గుడ్డు మాత్రమేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.