Telangana DGP sensational comments : నిందితుడి మృతిపై ఎలాంటి అనుమానాలకూ తావు లేదని స్పష్టం చేశారు. సోషల్‌మీడియాలో రాజు మృతిపై ఆరోపణలు రావడం, అలాగే పోలీసులు కావాలనే రాజును ఎన్ కౌంటర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని నిందితుడు కుటుం సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంపై డీజీపీ స్పందించారు.
Saidabad girl's rape and murder case accused Raju's suicide case: హైదరాబాద్: సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నప్పటికీ.. రాజుది ఆత్మహత్య కాదు, అతడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టుకు (TS High court) ఫిర్యాదు చేశారు.
బుధవారం తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి నిందితుడిని పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తామని చెప్పిన 24 గంటల్లో మృతదేహం లభ్యం అవటం పలు అనుమానాలకు దారి తీస్తుంది.
సైదాబాద్ ఘటన పట్ల తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల చెక్ అందించి ఆర్థికంగా ఆదుకుంది. మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ చిన్నారి తల్లి దండ్రులను కలిసి వారికి దైర్యం చెప్పారు.
సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి తప్పించుకుంటున్న రాజు మృతదేహాన్ని వరంగల్ రైల్వే ట్రాక్ వద్ద పోలీసులు కనుగొన్నారు. హత్యా? ఆత్మ హత్యా ? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.