AP TDP President Atchannaidu Arrested: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య రాజకీయ వేడి పెంచుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో అణు విద్యుత్ కేంద్రం రాబోతోంది. సాక్షాత్తూ కేంద్రం ఈ ప్రకటన చేసింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ లో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.
ఆర్య సమాజ్ నేత, సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ (80) అనారోగ్యంతో కన్నుమూశారు. దేశవ్యాప్తంగా జరిగిన అనేక సామాజిక ఉద్యమాలకు, పోరాటాలకు వెన్నుదన్నుగా నిలవడంతోపాటు.. స్వామి అగ్నివేశ్ భ్రూణహత్యలు, వెట్టిచాకిరి, మహిళా సమస్యలపై, సామాజిక అంతరాలపై గొంతెత్తారు.
తన కోరిక తీర్చకపోతే ( Sexual Favors ) మహిళా ఉద్యోగికి సెలవు ఇవ్వడం కుదరదు అన్నాడు ఒక డిపో మేనేజర్. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని (Srikakulam ) టెక్కలి ఆర్టిసీ బస్ డిపోలో జరిగింది. ఈ బస్ డిపోలో పనిచేసే ఒక ఉన్నత అధికారి అక్కడి మహిళా ఉద్యోగులతో అసభ్యంగా ప్రవర్తించాడు.
వైద్య విభాగం నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ మేరకు స్టాఫ్ నర్స్ (GGH Recruitment for Staff Nurse Jobs) 199 పోస్టులతో పాటు రేడియోగ్రాఫర్ 02 పోస్టులు, చైల్డ్ సైకాలజిస్ట్ 01 పోస్ట్, ఫార్మసిస్ట్ 01 పోస్టు కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు.
COVID-19 patient funeral: అమరావతి: కరోనావైరస్‌ని నివారించాలంటే కరోనావైరస్తో యుద్ధం చేయాలి కానీ.. కరోనా సోకిన రోగితో కాదు అని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నప్పటికీ.. అక్కడక్కడ కరోనా సోకిన వారి పట్ల అధికారులు, జనం వ్యవహరిస్తున్న తీరు మాత్రం మారడం లేదు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా లక్షణాలతో ఓ వృద్ధుడు మరణించగా.. ఆయన మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది జేసీబీతో స్మశానవాటికకు తరలించడం సంచలనం సృష్టించింది.
కర్ణాటకలో క్వారంటైన్ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తున్న పశ్చిమ బెంగాల్ వాసులు శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన 42 మంది వలస కూలీలు ( Migrant workers from West Bengal ) ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు బాలిగాం సమీపంలో బోల్తా పడింది.
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల్లో ఆధునికత పెరుగుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో వింత ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆచారాలతో పెద్దగా సమస్య లేనప్పటికీ .. వింతగా అనిపిస్తుంటాయి. అలాంటిదే శ్రీకాకుళం జిల్లాలోనూ ఓ వింత ఆచారం వెలుగులోకి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.