Heavy Rains In Hyderabad: హైదరాబాద్‌లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుండే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ఎంతో తప్పనిసరైతే తప్పించి అనవసహరంగా బయటికి వెళ్లొద్దంటూ అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీచేసింది.
Hyderabad Rains: హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. గత వారంలో నగర పరిధిలో భారీ వర్షాలు కురిశాయి. మధ్యలో నాలుగు రోజులు చినుకు పడలేదు. తాజాగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉదయం నుంచి ముసురు కమ్మేసింది.
Telangana Rains Update: తెలంగాణలో మళ్లీ వానలు మొదలయ్యాయి. రెండు రోజుల పాటు కాస్త తెరిపినిచ్చిన వానలు మళ్లీ షురూ అయ్యాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి.
Telangana Rains: తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 11 జిల్లాలకు తాజాగా వాతావరణ శాఖ రెడ్ అలెర్జ్ జారీ చేసింది. కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, అసిఫాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది. ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
Godavari Floods Live: వారం రోజులు కుండపోతగా కురిసిన వర్షాలతో తెలంగాణలో అపార నష్టం జరిగింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వరదలు బీభత్సం స్పష్టించాయి. వందలాది గ్రామాలు నీట మునిగాయి. వర్షాలు తగ్గి మూడు రోజులైనా వరద మాత్రం తగ్గలేదు. ఇంకా పలు గ్రామాలు జల దిగ్భంధంలోనే ఉన్నాయి.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం (జూలై 17) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. గోదావరి వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు.
Badrachalam Flood: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. అయితే నిన్నటితో పోలిస్తే ఇవాళ భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి కాస్త తగ్గింది.
Telangana Rains, Bahubali Movie Scene repeat in Manthani. మూడు నెలల పసికందును కాపాడేందుకు కుటుంబ సభ్యులు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సీన్‌ను రిపీట్ చేశారు.
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు పొడగించింది. మరో మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సోమవారం (జూలై 18) నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని ప్రభుత్వం సూచిస్తోంది.
Telangana Schools: తెలంగాణలో వారం రోజులుగా ఎకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో మూడు రోజులు అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సోమ, మంగళ, బుధవారాలు స్కూళ్లు మూతపడ్డాయి. మూడు రోజుల సెలవులు ముగియడంతో గురువారం విద్యాసంస్థలు తెరుచుకోవాల్సి ఉంది
Godavari Floods: తెలంగాణలో వారం రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో వరదలు పోటెత్తుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా జూలై నెలలోనే గోదావరి ఉగ్రరూపం దాల్చింది. బాసర నుంచి భద్రాచలం, పోలవరం మీదుగా ధవశేశ్వరం వరకు గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
Telanagana Floods: తెలంగాణలో కుండపోత వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. గంటల వ్యవధిలోనే 20 సెంటిమీటర్లకు పైగా వర్షం కురుస్తుండటంతో వరద పోటెత్తుతోంది.నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకి రికార్డు స్థాయిలో వరద వస్తుండటంతో ప్రమాదంలో పడింది. అధికారులు చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Telangana Rain Alert: తెలంగాణపై వరుణుడి పంజా కొనసాగుతోంది. వారం రోజులైనా సూర్యుడు జాడే లేకుండా పోయాడు. జోరు వానలతో తెలంగాణ మొత్తం తడిసి ముద్దవుతోంది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది.
Telangana EAMCET 2022: షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించిన అధికారులు.. వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రేపు మరియు ఎల్లుండి జరగాల్సిన అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు.. జులై 18, 19, 20 న జరిగే ఎంసెట్ పరీక్షలు యధావిధిగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
Telangana Rain Alert: తెలంగాణలో వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో కుండపోత వానలు కంటిన్యూ అవుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ లో ఈ ఉదయం కేవలం రెండు గంటల్లోనే 78 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.
Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం కుండపోతగా వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రెండు, మూడు గంటల్లోనే 100 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. కుండపోత వానలతో జిల్లాలోని వాగులు, వంకలు పొగి ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.