Mla Pilot Rohit Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ విచారణకు రావాలంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి గతంలో ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈడీ విచారణ ను నిలిపివేయాలంటూ.. హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు రోహిత్ రెడ్డి.
Nanda Kumar Bail: నంద కుమార్‌ఫై ఇందిర కోన అనే మరో మహిళ ఫిర్యాదు చేశారని.. ఆమే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నందున ఆ కేసులో నంద కుమార్‌పై పిటి వారెంట్ కావాలని బంజారాహిల్స్ పోలీసులు కోర్టును కోరారు.
TRS MLAs Poaching Case Bail Plea: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీ ఫారంతో గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన రోహిత్ రెడ్డి ఫిర్యాదులో వాస్తవం లేదని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసు చెల్లదని స్పష్టంచేస్తూ బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు.
TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేయాలని చూసిన వ్యవహారంతో బీజేపీకి ఏ సంబంధం లేకపోతే ఈ కేసు విచారణ ఆపాలని కోరుతూ కోర్టుకు ఎందుకు వెళ్తోందని ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు.. బీజేపీ పార్టీ బండారం బయటపడుతుందేమోననే భయంతోనే కోర్టుకు వెళ్తోందని ఎద్దేవా చేశారు.
TRS MLAs Poaching Case: తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ జరిపే విచారణపై బీజేపీకి ఏ మాత్రం నమ్మకం లేదని డికే అరుణ ప్రకటించారు. ఫామ్ హౌజ్ ఫైల్స్ కుట్రదారుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేదే తమ అనుమానం అని సందేహం వ్యక్తంచేశారు.
TRS MLAs poaching case: తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు ఏజెంట్లు వచ్చి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిపినట్టుగా మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.
TRS MLAs Trap Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల కేసు రిమాండ్ నివేదికలో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచి రాష్ట్రంలో రాజకీయ అనిశ్ఛిత పరిస్థితులను సృష్టించేందుకు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినట్టుగా కేసు నమోదు చేసిన పోలీసులు.. అవే అంశాలను రిమాండ్ నివేదికలో కీలకంగా ప్రస్తావించారు.
TRS MLAs Case: ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపి ప్రయత్నించిందని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TRS MLA Rohit Reddy: టిఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇంతకు నిందితుడా లేక కోవర్టా ? టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ట్రాప్ కేసు కట్టు కథేనా ? ఇదంతా టీఆర్ఎస్ పార్టీ ఆడిన డ్రామానా లేక రోహిత్ రెడ్డి సొంతంగా ప్లాన్ చేసిన స్కెచ్చా ? నిజం ఏంటి ?
TRS MLA Rohit Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కీలక విషయాలు వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపిలో చేర్చుకునే పథకంలో భాగంగా వారితో ఒక ఒప్పందానికి వచ్చేందుకు ముగ్గురు ఏజెంట్స్ కలిసినట్టు రోహిత్ రెడ్డి చేస్తోన్న ఆరోపణలు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.