MLA Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ లో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనాలని చూశారని చెప్పారు.
Nanda Kumar Bail: నంద కుమార్‌ఫై ఇందిర కోన అనే మరో మహిళ ఫిర్యాదు చేశారని.. ఆమే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నందున ఆ కేసులో నంద కుమార్‌పై పిటి వారెంట్ కావాలని బంజారాహిల్స్ పోలీసులు కోర్టును కోరారు.
Trs Mlas Poaching Case: ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. అడ్వకేట్ శ్రీనివాస్‌కు మరోమారు నోటీసులు జారీ చేసింది. ఇవాళ మరోసారి విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. నందు, సింహయాజీతో కలిసి ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే అంశానికి సంబందించి తనకు అసలు ఎలాంటి సమాచారం తెలియదని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. తాము ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు శ్రీనివాస్‌ను ఆదేశించారు.
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకోనుంది. హైదరాబాద్‌లోని సిట్ ఆఫీసులో విచారణకు రావాలని అధికారులు నలుగురికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
SIT Officials Issues Notice To Tushar: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో సిట్ విచారణ దూకుడు పెంచింది. ఈ కేసులో తుషార్‌కు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల లీక్ అయిన వీడియోల్లో తుషార్ పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే.
TRS MLAs Poaching Case Bail Plea: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీ ఫారంతో గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన రోహిత్ రెడ్డి ఫిర్యాదులో వాస్తవం లేదని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసు చెల్లదని స్పష్టంచేస్తూ బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు.
TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేయాలని చూసిన వ్యవహారంతో బీజేపీకి ఏ సంబంధం లేకపోతే ఈ కేసు విచారణ ఆపాలని కోరుతూ కోర్టుకు ఎందుకు వెళ్తోందని ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు.. బీజేపీ పార్టీ బండారం బయటపడుతుందేమోననే భయంతోనే కోర్టుకు వెళ్తోందని ఎద్దేవా చేశారు.
TRS MLAs Poaching Case: తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ జరిపే విచారణపై బీజేపీకి ఏ మాత్రం నమ్మకం లేదని డికే అరుణ ప్రకటించారు. ఫామ్ హౌజ్ ఫైల్స్ కుట్రదారుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేదే తమ అనుమానం అని సందేహం వ్యక్తంచేశారు.
TRS MLAs poaching case: తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు ఏజెంట్లు వచ్చి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిపినట్టుగా మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు హైకోర్టు విచారించనుంది. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
TS High Court On TRS mlas Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.