KCR VS MODI: రాజకీయ కార్యక్రమాల్లో ప్రధాని మోడీకి దూరంగా ఉండటం ఓకే కాని ప్రభుత్వ కార్యక్రమాలకు ఎందుకు హాజరుకావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతుందని పదేపదే ఆరోపిస్తున్న కేసీఆర్.. ప్రధాని పర్యటనలో పాల్గొని తన అసమ్మతిని తెలుపవచ్చు కదా అనే టాక్ జనాల నుంచి వస్తోంది.
Telangana Politics: వలస నేతలు బీజేపీలో ఇమడలేకపోతున్నారా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కమలం పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదా.. అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు జరిగాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలు పోటిపడి మరీ కమలం గూటికి చేరారు. తమ పార్టీలోకి చేరికలు భారీగా ఉండబోతున్నాయని కొంత కాలంగా బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కాని ఆ పార్టీలోకి వలసలు లేకపోగా.. జంపింగులు ఎక్కువయ్యాయి. గత వారం రోజులుగా రోజు ఎవరో ఒక కీలక నేత కమలం పార్టీకి గుడ్ బై చెప్పేసి.. కారు ఎక్కేస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ రాపోలు
Komatireddy Rajgopal Reddy: తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేనంతగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా పోరాడుతున్న ప్రధాన పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే మూడు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. చౌటుప్పల్ మండలం జైకేసారంలో ఏకంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై దాడి జరిగింది.
Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేనంతగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా పోరాడుతున్న ప్రధాన పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే మూడు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి
Telangana Politics: కోటి ఆశలతో బీజేపీలో చేరినా అక్కడ ఇమడలేక బయటకి వచ్చిన నేతల లిస్ట్ భారీగానే ఉంది. నాగం జనార్ధన్ రెడ్డి మొదలుకొని ఆనంద భాస్కర్ వరకు ఆ లిస్టు పెద్దగానే ఉంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
KTR TARGET PM MODI: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరును విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎమునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈసీ ఎప్పుడు ఇస్తుందో బీజేపీ నేతలు ముందే చెబుతున్నారని ఆరోపించారు.
KTR VS KISHAN REDDY: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. అధికారమే లక్ష్యంగా తెలంగాణలో దూకుడు పెంచిన కమలనాధులు.. కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రానికి క్యూ కడుతున్న కేంద్ర మంత్రులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.
Mission Bhagiratha: కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ మధ్య వివాదం రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతి విషయంలోనూ ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆవార్డుల విషయంలో రచ్చ సాగుతోంది.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుండి మొదలుకానున్నాయి. గత మార్చిలో చివరి సారిగా అసెంబ్లీ సమావేశమైంది. ఆరు నెలలు ముగుస్తుండటంతో అసెంబ్లీని నిర్వహిస్తోంది కేసీఆర్ ప్రభుత్వం.శాసనమండలి కూడా మంగళవారమే ప్రారంభం కానుంది.
September 17th: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. సెప్టెంబర్ 17 చుట్టూ పాలిటిక్స్ సాగుతున్నాయి. దీనిపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
TRS VS BJP: కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ మధ్య కొన్ని రోజులుగా వార్ సాగుతోంది. నరేంద్ర మోడీ సర్కార్ నిధుల విడుదల, ప్రాజెక్టుల మంజూరులో తెలంగాణపై వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ సర్కార్ ఆరోపిస్తుండగా.. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తూ కేసీఆర్ సర్కార్ అక్రమాలకు పాల్పడుతుందని బీజేపీ పెద్దలు ఆరోపిస్తున్నారు
Target KCR: జేపీ నడ్డా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి మాట్లాడటంతో కేంద్రం నుంచి ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కొన్ని రోజులుగా తెలంగాణలో మకాం వేసిన కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో పాటు కాగ్ టీమ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోకస్ చేసిందని చెబుతున్నారు
TRS VS BJP: తెలంగాణ రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. కొన్ని రోజులుగా అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం సాగుతుండగా.. ఢిల్లీలో లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరు రావడం రాజకీయ రచ్చ రాజేసింది.
CPI Narayana: తెలంగాణలో రాజకీయాలు వేడి మీద ఉన్నాయి. మునుగోడులో బీజేపీ సభ తర్వాత మరింత హీటెక్కాయి. ఈక్రమంలో కేంద్రమంత్రి అమిత్ షాపై సీపీఐ సీనియర్ నేత నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
TRS VS BJP: కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత దూకుడు పెంచుతున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీని ఇరుకున పెట్టేలా వ్యూహరచన చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. దీంతో ఉభయ సభల్లో టిఆర్ఎస్ అనుసరించాల్సిన విధివిధానాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్
BJP VS TRS: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతుండగా.. ఆ సమయంలో రాజకీయ కార్యక్రమాలు పెట్టారు కేసీఆర్.సీఎం కేసీఆర్ తీరుపై బీజేపీ జాతీయ నేతలు ఆరా తీశారని తెలుస్తోంది. ఫ్లెక్సీల రాజకీయం ప్రధాని మోడీ దృష్టికి వెళ్లిందని చెబుతున్నారు
Trs Counter: ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలు రాష్ట్రంలో కాకరేపాయి. కుటుంబపాలనపై మోదీ కామెంట్స్ టీఆర్ఎస్ నేతలకు కోపం తెప్పించాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చుడు అనేది ఆశ అని టీఆర్ఎస్ నేతలు తేల్చిచెప్పారు.
BJP vs TRS: హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం తర్వత అధికార టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ విమర్శల జోరు పెంచింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ భారత ప్రధానిని ' మోడీ గాడు' అని సంబోధించిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ -బీజేపీ మధ్య చిచ్చురేగుతోంది.ఈ క్రమంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ తప్పుపట్టారు. శుక్రవారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ మాట్లాడుతూ ప్రధాని స్థాయి వ్యక్తిని పట్టుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకవచనంతో సంబోధిస్తున్నారు.. రాజ్యాంగపరంగా ఉన్నత పదవుల్లో ఉన్నవారు ప్రధాన మంత్రిని ఏకవచనంతో విమర్శించడం తగదన్నారు . ఇది ఏ మాత్రం మంచి సాంప్రదాయంకాదని హితవుపలికారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.