Munugode ByPoll:గతంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. తాజాగా మాత్రం ఆయనకు మద్దతుగా ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.సంస్థాన్ నారాయణపురంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా పోస్టర్లు వేశారు
Munugode Bypoll: ప్రచారమే నిజమైంది. టీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ కు తన రాజీనామా లేఖ పంపించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బూర.. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, భువనగిరి ఎంపీగా పని చేసిన అనుభవాలను లేఖలో పంచుకున్నారు. అయితే టీఆర్ఎస్ లో రాజకీయ బానిసత్వం చేస్తూ తాను ఇక పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు.
Medak MP Kotha Prabhakar Reddy : బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందంటూ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ద్వారా బీజేపీ అరాచకాలను ప్రజల ముందు ఉంచుతామని అన్నారు.
Munugode Bypoll : మునోగుడు ఉప ఎన్నికలు, టీఆర్ఎస్, బీజేపీ నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కిపోతోంది. తాజాగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికలు దేశ చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. నాలుగు కోట్ల ప్రజలకు, కేసీఆర్కు మధ్య జరుగుతోందని అన్నాడు.
Palvai Sravanthi: మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ వేసేందుకు సిద్దమైంది. కాంగ్రెస్ కార్యాలయం దగ్దమైన ఘటనతో పాల్వాయి స్రవంతి రోడ్డుపై బైటాయించిన సంగతి తెలిసిందే. ఆమె ఈ నెల 14న నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు.
Munugode ByPoll : మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుతున్నాయి. 18 వేల కోట్ల కాంట్రాక్టులు ఇవ్వడంతోనే బీజేపీలోకి చేరారంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ మీద టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తే.. కేసీఆర్ కుటుంబం కబందహస్తాల్లో 18 లక్షల కోట్ల తెలంగాణ భూములున్నాయని రాజగోపాల్ రెడ్డి ఆరోపించాడు.
Rajasingh PD Act Case : రాజాసింగ్ పీడి యాక్ట్ కేసు మీద ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు మీద హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడం మీద హైకోర్టు మండిపడింది.
KCR visits BRS Office in Delhi: హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి పార్టీగా మార్చుతున్నట్టు ప్రకటించిన తర్వాత నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారిగా ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కోసం సిద్ధమవుతోన్న కార్యాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు.
Komatireddy Rajagopal Reddy: ఇంతకాలం సీఎం కేసీఆర్ సీఎం హోదాలో ఉండి జుగుప్సాకరమైన భాష వాడుతున్నారని.. ఆయన కొడుకు మంత్రి కేటీఆర్ చదువుకున్న వాడు కనుక తండ్రిలా మాట్లాడడు అనుకున్నాను కానీ కేటీఆర్ కూడా కేసీఆర్ తరహాలోనే జుగుప్సాకరమైన భాష వాడడం బాధాకరం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Komatireddy Venkat Reddy to KTR: మంత్రి కేటీఆర్ పై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్ తనను కోవర్ట్ అని సంబోధించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తనను అలా పిలవడానికి నీకున్న అర్హత ఏంటో చెప్పాల్సిందిగా నిలదీశారు.
Boinpally Abhishek Rao Arrest : ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా బోయినపల్లి అశోక్ రావు అరెస్ట్ తెలంగాణలో ప్రకంపనలు మొదలయ్యాయి.అయితే ఈ అరెస్ట్ తరువాత ఎవరి అరెస్ట్ ఉంటుందో అని అంతా అనుకుంటున్నారు. అసలే ఈ కుంభకోణంలో కవిత పేరు మొదటి నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
TRS complaint on Komati Reddy Rajagopal Reddy: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ వివరాలలోకి వెళితే
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారనే ఆరోపణలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారంటూ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు చేసిన ప్రకటనపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విటర్ ద్వారా స్పందించారు.
Minister Malla Reddy Liquor Party: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి మల్లా రెడ్డి.. ఒక ఇంచార్జుగా తనకు అప్పగించిన గ్రామాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు స్వయంగా తానే మందు పార్టీ ఇస్తుండగా తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Nirmala Sitharaman Slams KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి మంత్రాలు, తంత్రాలపై నమ్మకం ఎక్కువని ఆగ్రహం వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.