MLC Jeevan Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా టీఆర్ఎస్ పార్టీ మీద నిప్పులు చెరిగారు. ఎన్నికలు వస్తేనే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయా? అంటూ చురకలు అంటించారు.
Bandi Sanjay Munugode Bypoll Campaign: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక ఝూటా మాటల కేసీఆర్ అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలనే ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని చెబుతూ ఆయన పలు పోస్టర్లు విడుదల చేశారు.
Munugode bypolls campaigns: మునుగోడులో ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య ప్రతీకార జ్వాలలు రాజుకుంటున్నాయి. అభ్యర్థుల అనుచరులు ఒకరిపై మరొకరు పరస్పరం దాడులు చేసుకుంటూ ఎన్నికల వేడి రాజేస్తున్నారు.
Munugode Bypoll : మునుగోడు ఎన్నికల్లో ప్రధాన పార్టీలు తమ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక పాల్వాయి స్రవంతి కాన్వాయిని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు.
TRS-KCR : తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. బీజేపీకి కళ్లెం వేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ మీద టీఆర్ఎస్ ఫుల్ ఫోకస్ పెట్టేసింది.
Liquor Bottles To Munugode Bypoll Voters: మునుగోడు ఉప ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతున్న తీరు చూస్తోన్న నెటిజెన్స్.. పనికి ఆహార పథకం తరహాలో ప్రస్తుతం ఓటుకు మద్యం పథకం నడుస్తోందంటున్నారు. మునుగోడులో స్థానికంగా ఉండని వారి కోసం కూడా హైదరాబాద్ లోనే ఫంక్షన్ హాళ్లలో మీటింగులు పెట్టి అక్కడే అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాల తరహాలో వారికి అందాల్సిన మద్యం బాటిళ్లు వారికే పంపిణి చేస్తున్నారు.
Rapolu Ananda Bhaskar To Join TRS: బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ప్రస్తుత రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణం అయిపోయాయి.
Jitender Reddy reaction on joining TRS party : మాజీ ఎంపీ, బీజేపి నేత జితేందర్ రెడ్డి బీజేపికి గుడ్ బై చెప్పి తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై జితేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. తెలంగాణలో ఏ ఇద్దరు కలిసినా మునుగోడులో ఏ పార్టీ గెలుస్తుందనే చర్చే జరుగుతోంది.
Munugode bypolls 2022: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడులో బీజేపీ గెలిచాక టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని ఆయన అన్నారు.
Harish Rao Meeting with Munugode TRS workers: మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేవలం తన స్వలాభం కోసమే రాజీనామా చేశాడని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అంతేకాదు.. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో, ఎందుకు మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో రాజగోపాల్ రెడ్డికే తెలియదు అని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై, తెలంగాణ ప్రభుత్వంపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఇక మాట్లాడటానికి ఏమీ లేదని.. ఏం చేసినా చేతలతోనే చేసి బొంద పెడతా అని తన రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి హెచ్చరికలు జారీచేశారు.
Pawan Kalyan on Dasoju Sravan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌కు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా బీజేపీని తిట్టిన ఆయనను పొగడ్తలతో ముంచారు.
మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్న కొద్ది అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు. టీఆర్ఎస్ నుంచి కమలం పార్టీలోకి చేరిన నేతలకు మళ్లీ గాలం వేస్తూ.. తిరిగి పార్టీలోకి రప్పిస్తున్నారు. ఇటీవలె బీజేపీలోకి చేరిన దాసోజు శ్రవణ్.. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన అధికార టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు.
Budida Bikshamaiah Goud Joins TRS: కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరు కాంగ్రెస్ పార్టీలో ఉండి భారతీయ జనతా పార్టీరి పనిచేస్తే.. ఇంకొక సోదరుడు 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనుల కోసం పార్టీ మారాడు అని బిక్షమయ్య గౌడ్ చెప్పుకొచ్చారు. గురువారం బీజేపికి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన.. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఒంటికాలిపై లేచినంత పనిచేశారు.
Road Roller Symbol: ఎన్నికల గుర్తుల కేటాయింపు విషయంలో టీఆర్ఎస్కి ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. కారు గుర్తును పోలి ఉన్న రోడ్ రోలర్ గుర్తును ఎవ్వరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలకు ఎన్నికల కమిషన్ చెక్ పెట్టింది.
Minister Srinivas Goud Comments On KTR: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అంటూ జోస్యం చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాశంగా మారాయి.
Revanth Reddy fire on KTR: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌లపై మండిపడ్డారు.
Minister Koppula Eshwar: టీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు ఉందని.. తాము డబ్బుతో రాజకీయాలు చేసే వాళ్ళం కాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్.. బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.