Airtel: ఎయిర్‌టెల్‌ తీసుకు వచ్చిన అద్భుతమైన డేటా వోచర్‌

తక్కువ ధరలో డేటాతో పాటు అపరిమిత కాల్స్ ను ఇస్తూ ఉన్న ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌ లో రూ.148 డేటా వోచర్ తో 15 జీబీ డేటాను.. ఎక్స్‌ట్రీమ్‌ ప్లే సబ్‌స్క్రిప్షన్ ను ఇస్తోంది. ఆ వివరాలు..

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 25, 2023, 06:24 PM IST
Airtel: ఎయిర్‌టెల్‌  తీసుకు వచ్చిన అద్భుతమైన డేటా వోచర్‌

Airtel: భారతీయ టెలికాం రంగంలో జియో ఎంట్రీతో ఎంతటి మార్పులు వచ్చాయో అందరికి తెల్సిందే. ఒకప్పుడు 1జీబీ డేటాను కొనుగోలు చేసేందుకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు వందల జీబీల డేటాను ప్రతి నెల వినియోగిస్తున్న మొబైల్ వినియోగదారులు ఉన్నారు. జీయో వారు తీసుకు వచ్చిన చౌక డేటాను అన్ని కంపెనీల ఆపరేటర్లు ఇస్తున్న విషయం తెల్సిందే. 

ప్రస్తుతం భారత్ లో ప్రధానంగా మూడు టెలికాం సంస్థలు ఉన్నాయి. అందులో జియో ఇంకా ఎయిర్‌ టెల్‌ సంస్థలు తమ వినియోగదారులకు అత్యంత చౌకగా డేటాను అందించేందుకు పోటీ పడుతున్నాయి. మేము అద్భుతమైన డేటా వోచర్ ఇస్తామంటే మేము ఇస్తాం అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. తాజాగా భారతీ ఎయిర్‌ టెల్ వారు తమ కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్‌ ను తీసుకు రావడం జరిగింది.  తక్కువ ధరలో డేటాతో పాటు అపరిమిత కాల్స్ ను ఇస్తూ ఉన్న ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌ లో రూ.148 డేటా వోచర్ తో 15 జీబీ డేటాను.. ఎక్స్‌ట్రీమ్‌ ప్లే సబ్‌స్క్రిప్షన్ ను ఇస్తోంది. 

ప్రస్తుతం ఉన్న ప్లాన్ తో కలిపి ఈ యాడ్‌ ఆన్ ప్లాన్‌ ను వినియోగించుకోవచ్చు. ఈ కొత్త ప్లాన్‌ లో ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లను కూడా వినియోగించుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. దీంతో ఎయిర్టెల్‌ వినియోగదారులు అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ లో ఉన్న డేటా వోచర్‌ లలో ఇది బెస్ట్‌ అన్నట్లుగా వినియోగాదారులు మరియు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త రీచార్జ్‌ ఆఫర్‌ వల్ల ఎయిర్‌ టెల్ వినియోగదారుల డేటా వినియోగం మరింతగా పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

Also Read: Telangana, AP Rains News Live Updates: తెలంగాణ, ఏపీలో ఈ మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

రూ.148 డేటా వోచర్ రీచార్జ్ తో 28 రోజుల పాటు 15 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఉంటే అది ఎక్స్‌పైరీ అవుతుంది. ఇక సోనీ లీవ్‌ ప్రీమియం.. ఈరోస్ నౌ.. హోయిచోయ్.. లయిన్స్ గేట్ వంటి ప్రముఖ ఓటీటీల కంటెంట్‌ ను ఈ డేటా ఓచర్ కారణంగా ఉచితంగా చూడవచ్చు. 

మొత్తానికి ఎయిర్ టెల్‌ వారు తీసుకు వచ్చిన ఈ సరికొత్త డేటా వోచర్‌ వల్ల 28 రోజుల పాటు వినియోగదారులు 15 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు.. అంతే కాకుండా ఓటీటీలను కూడా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఇక రూ.149 రీఛార్జ్ తో 30 రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజు 1 జీబీ డేటా వస్తుందనే విషయం తెల్సిందే.

Also Read: IRCTC Server Down: ఐఆర్‌సీటీసీ సర్వర్ డౌన్.. టికెట్‌ బుకింగ్స్‌కు అంతరాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

 

Trending News