Redmi 12 Launch: దేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎక్కువ భాగం చైనా ఫోన్లే ఆక్రమిస్తున్నాయి. ధర తక్కువగా ఉండి, ఫీచర్లు అద్భుతంగా ఉండటంతో పాటు స్టైలిష్ లుక్ ఉండటం మరో కారణం. అందుకే ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్ మి ఇండియాలో పాతుకుపోయింది. ఇప్పుడు సరికొత్త మోడల్‌తో ముందుకొస్తోంది.
చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్ మి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటోంది. ఇప్పుడు అదే విధంగా రెడ్ మి 12 పేరుతో కొత్త మోడల్ ఆగస్టు 1న ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్దమౌతోంది. ట్విట్టర్ ద్వారా అధికారికంగా రెడ్ మి 12 లాంచ్ డేట్ ప్రకటితమైంది. క్రిస్టల్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఈ ఫోన్ ప్రత్యేకతగా ఉండనుందని తెలుస్తోంది. క్రిస్టల్ గ్లాస్ డిజైన్, స్టైల్ ఐకాన్ రెడ్ మి 12 ఫోన్ ప్రత్యేకతగా ఉండనుంది.
రెడ్ మి 12 స్మార్ట్‌ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.79 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వెడల్పు 168.60 మిల్లీమీటర్లు కాగా, 76.28 మిల్లీమీటర్ల మందంతో ఉంటుంది. బరువు 198.5 గ్రాములుంటుంది. రెడ్ మి 12 స్మార్ట్‌ఫోన్ 1080/2460 ఫుల్ హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్ 3965 పిక్సెల్స్ డెన్సిటీ కలిగి ఉంటుంది. థాయ్ లాండ్ లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర 12,400 రూపాయలు కాగా ఇండియాలో కూడా దాదాపుగా అంతే ఉండవచ్చు. ఇంకా కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.
రెడ్ మి 12 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో జి88 ప్రోససెర్‌తో పనిచేస్తుంది. సోలార్ సిల్వర్, మిడ్ నైట్ బ్లాక్, స్కై బ్లూ మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్, 8 జీబి ర్యామ్ 256 జీబీ స్టోరేజ్‌లలో లభ్యమౌతుంది. ఏకంగా 1 టీబీ వరకూ స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో కెమేరా కూడా అద్బుతంగా ఉంటుంది. ఇందులో 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమేరాలతో పాటు 50 మెగాపిక్సెల్ త్రిపుల్ కెమేరా ఉండటం విశేషం. ఫ్రంట్ కెమేరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కావడంతో ఎక్కువసేపు ఉంటుంది. రెడ్ మి 12 థాయ్‌లో 12,500 కు లభ్యమౌతున్నా ఇండియాలో మాత్రం అంతకంటే ఎక్కువే ఉండవచ్చు. 15 వేల వరకూ ఉండవచ్చని అంచనా.
Also read: Hyundai Exter: హ్యుండయ్ నుంచి మిడ్ సైజ్ ఎస్‌యూవీ, ధర 6 లక్షలే, చూస్తే మతి పోతుంది మరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook