Apple Iphone 15 offer : కేవలం ₹12,100కి ఆపిల్ ఐఫోన్ 15 ని పొందండి.. ఎలాగో తెలుసా..

Apple iphone 15 offer 2023 : ఐఫోన్ 15 ని అత్యంత తక్కువ ధర కి పొందాలి అనుకుంటూ ఉన్నారా.. అయితే ఈ చిన్న విషయం తెలుసుకోండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2023, 11:21 AM IST
Apple Iphone 15 offer : కేవలం ₹12,100కి  ఆపిల్ ఐఫోన్ 15 ని పొందండి.. ఎలాగో తెలుసా..

Apple iphone : ఆపిల్ ఫోన్ అనేది ఒక స్టేటస్ బ్రాండ్ లాగా చూస్తారు అందరూ. ఆపిల్ ఫోన్ ని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఆపిల్ ఫోన్ చేతిలో పట్టుకొని అద్దం ముందర ఫోటో తీసుకోవడం కూడా మన సోషల్ మీడియాలో ఎప్పటినుంచో సాగుతోన్న ట్రెండ్ . అందుకే ఈ ఫోన్ అంటే అందరికీ విపరీతమైన అభిమానం. ఇక అలాంటి ఐఫోన్ పైన ఆఫర్లు వచ్చాయి అంటే చాలు ఆ ఆఫర్ గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి చూపిస్తారు.

కాగా ఆపిల్ ఇటీవల తన తాజా ఫ్లాగ్‌షిప్ మ iPhone 15 ను విడుదల చేసింది. ఇక ఈ ఫోన్ ధర భారతదేశంలో అధికారికంగా రూ.79,900 నుండి ప్రారంభమవుతుంది. అయితే, మీరు iPhone 15 కొనుగోలుపై రూ. 67,800 వరకు భారీ తగ్గింపును పొందవచ్చు అన్న విషయం తెలుసా??..

అవును ఆశ్చర్యపోకండి.. మీరు విన్నది నిజమే. ఇప్పుడు, మీరు ఆపిల్ ట్రేడ్ ఇన్ ఆఫర్ సహాయంతో ఆపిల్ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి కేవలం రూ. 12,100కి iPhone 15ని కొనుగోలు చేయవచ్చు. మరి ఈ ఆఫర్ పొందడం ఎలానో ఒకసారి చూద్దాం.

Apple ట్రేడ్ ఇన్‌తో, మీ పాత ఏదైనా ఆపిల్ ప్రాజెక్ట్ ఎక్స్చేంజ్ ఇవ్వడం ద్వారా మీరు ఐఫోన్ 15 పైన ఎంతో తగ్గింపు పొందొచ్చు.  iPhoneలు, Mac నోట్‌బుక్‌లు, iPadలు, Apple వాచ్‌లతో సహా ఏ ఆపిల్ ప్రోడక్ట్ అయినా మీరు ఎక్స్చేంజ్ చేసి.. దానికి వచ్చిన డబ్బులతో మీరు ఐఫోన్ 15 పైన డిస్కౌంట్ పొందొచ్చు.

ఇక మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ పరంగా ట్రేడ్-ఇన్ విలువ అంచన కింది విధంగా ఉంటుంది :

ఐఫోన్ 14 ప్రో మాక్స్ :    ₹67800.00 వరకు
ఐఫోన్ 14 ప్రో     : ₹64500.00 వరకు
ఐఫోన్ 14 ప్లస్    : ₹42500.00 వరకు
ఐఫోన్ 14    : ₹40000.00 వరకు
ఐఫోన్ SE (3rd జనరేషన్)    : ₹21450.00 వరకు
ఐఫోన్ 13 ప్రో మాక్స్    : ₹55700.00 వరకు
ఐఫోన్ 13 ప్రో    : ₹53200.00 వరకు
ఐఫోన్ 13    : ₹38200.00 వరకు
ఐఫోన్ 13 మినీ    ₹34400.00 వరకు
ఐఫోన్ 12 ప్రో మాక్స్:    ₹41300.00 వరకు
ఐఫోన్ 12 ప్రో:     ₹38800.00 వరకు
ఐఫోన్ 12    : ₹27400.00 వరకు
ఐఫోన్ 12 మినీ :    ₹21000.00 వరకు
ఐఫోన్ SE (2వ జనరేషన్) :    ₹10520.00 వరకు
ఐఫోన్ 11 ప్రో మాక్స్    : ₹30900.00 వరకు
ఐఫోన్ 11 ప్రో :₹27030.00 వరకు
ఐఫోన్ 11    : ₹21200.00 వరకు
ఐఫోన్ XS మాక్స్    : ₹17900.00 వరకు
iPhone XS    : ₹16740.00 వరకు
iPhone XR    : ₹13800.00 వరకు
ఐఫోన్ X    : ₹12950.00 వరకు
ఐఫోన్ 8 ప్లస్    : ₹10690.00 వరకు
ఐఫోన్ 8     : ₹8550.00 వరకు
ఐఫోన్ 7 ప్లస్    : ₹7990.00 వరకు
ఐఫోన్ 7 :     ₹6080.00 వరకు

ఇక పైన ఐఫోన్ వారు మనకు ఇచ్చే ధరలు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఆ ఫోన్లోకి అంత ఎక్స్చేంజ్ ధర అయితే ఎక్కడ లేదు. కావున మీ దగ్గర ఏదన్నా ఆపిల్ ప్రాజెక్టు ఉంటే వెంటనే ఈరోజు ఎక్స్చేంజ్ చేసుకొని ఐఫోన్ 15 ని అతి తక్కువ ధరకే పొందండి.

ఇక ఈ ఆపిల్ ఐఫోన్ 15 ఫీచర్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ 17.00 cm (6.7″) సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, 5-కోర్ GPUతో A16 బయోనిక్ చిప్,‌ అధునాతన డ్యూయల్ కెమెరా సిస్టమ్,‌ ఫేస్ ID వంటి ఎన్నో అత్యుత్తమ ఫీచర్స్ తో మన ముందుకు వచ్చింది. మరి ఎందుకు ఆలస్యం వెంటనే పైన ఆఫర్లు చదివి ఈ ఫోన్ ని అత్యంత తక్కువ ధరకు మీ ఇంటికి తెచ్చుకునేయండి.

Also read: Best Mileage Cars Under Rs 6 Lakhs: జస్ట్ 6 లక్షలకే వచ్చే బెస్ట్ మైలేజ్ కార్లు

Also Read: Motorola Edge 40 Neo Price: పిచ్చెకించే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Motorola Edge 40 Neo మొబైల్..డెడ్‌ చీప్‌ ధరకే మీ కోసం..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News