Motorola G85 5G Price: 5000mAh బ్యాటరీ, 12GB ర్యామ్‌ Motorola G85 మొబైల్‌ రూ.18 వేలతో లాంచ్‌.. పూర్తి వివరాలు ఇవే!

Motorola G85 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి మరో మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో రానుంది. అలాగే Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌తో రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాలు ఇప్పుడే తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 10, 2024, 11:34 AM IST
Motorola G85 5G Price: 5000mAh బ్యాటరీ, 12GB ర్యామ్‌ Motorola G85 మొబైల్‌ రూ.18 వేలతో లాంచ్‌.. పూర్తి వివరాలు ఇవే!

Motorola G85 5G Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మోటరోలా మార్కెట్‌లోకి త్వరలోనే కొత్త మొబైల్‌ లాంచ్ కాబోతోంది. ఈ కంపెనీ జూలై 10వ తేదిన G సిరీస్‌లో కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. మోటరోలా తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను Motorola G85 5G పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన మైక్రో సైట్‌ కూడా ఫ్లిఫ్‌కార్ట్‌లో లైవ్‌ అవుతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌  24GB ర్యామ్‌తో పాటు 3D కర్వ్డ్ డిస్ప్లే సెటప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇప్పటికే ఈ Motorola G85 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ వివరాలు గూగుల్‌లో లీక్‌ అయ్యాయి. ఇక లీక్‌ అయిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.18,999 ధరతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీని అసలు ధర ఈ రోజు వెల్లడయ్యే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై త్వరలోనే ప్రత్యేమైన ఆఫర్స్‌ను కూడా ప్రకటించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా త్వరలోనే కంపెనీ ప్రకటించే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. 

ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
ఈ Motorola G85 5G మొబైల్‌ 6.7 అంగుళాల పోలెడ్ 3డి కర్వ్డ్ డిస్‌ప్లే సెటప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేయనుంది. ఈ డిస్ల్పే 1600 నిట్‌లు హై బ్రైట్‌నెస్‌ కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ ఈ డిస్ల్పే ప్రొటక్షన్‌ కోసం గొరిల్లా గ్లాస్ 5ను అందిస్తోంది. ఇప్పటికే ఈ వివరాలను ఫ్లిఫ్‌కార్ట్‌లో మైక్రోసైట్‌ ద్వారా కంపెనీ వెల్లడించింది. అయితే కంపెనీ రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో ఈ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు రానుంది. ఇందులోని మొదటి వేరియంట్‌ 8GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, రెంవది 12GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సెటప్‌ను కలిగి ఉంటాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఇతర ఫీచర్స్‌:
ర్యామ్ 24 జీబీకి పెంచుకుని సపోర్ట్‌
Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌
డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌
LED ఫ్లాష్‌
50-మెగాపిక్సెల్ OIS కెమెరా
8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్
32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 
5000mAh బ్యాటరీ
33 వాట్ల టర్బో ఛార్జింగ్‌ సపోర్ట్‌
2 సంవత్సరాల పాటు OS అప్‌గ్రేడ్ 
Android 14

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News