Motorola Edge 50 Pro: 50MP ఆర్టిఫిషియల్ కెమేరాతో కొత్త ఫోన్ లాంచ్ నేడే, ధర ఎంతంటే

Motorola Edge 50 Pro: దేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో ఫోన్ ఎంట్రీ ఇస్తోంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఇవాళ లాంచ్ కానుంది. ఈ ఫోన్ పీచర్లు, ధర గురించి తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 3, 2024, 02:04 PM IST
Motorola Edge 50 Pro: 50MP ఆర్టిఫిషియల్ కెమేరాతో కొత్త ఫోన్ లాంచ్ నేడే, ధర ఎంతంటే

Motorola Edge 50 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా నుంచి కొత్త ఫోన్ లాంచ్ అవుతోంది. Motorola Edge 50 Pro పేరుతో ఇవాళ ఇండియాలో లాంచ్ కానున్న ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ కెమేరా కలిగిన ఈ ఫోన్ మార్కెట్‌లో హల్‌చల్ చేయనుందని అంచనా. 

మోటోరోలా ఇంతకుముందు Motorola Edge 40 Pro లాంచ్ చేసింది. ఈ ఫోన్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఇది. ఇతర స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే చాలా ఫీచర్లు ఉన్నా..అన్నింటికంటే టాప్ ఫీచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమేరా. ఇందులో 6.67 ఇంచెస్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. 165 హెర్ట్జ్ అత్యధిక రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ఆధారంగా పనిచేసే ప్రోసెసర్ కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్ కలిగి ఉండటం వల్ల గ్రాఫిక్స్ లోడెడ్ వీడియో గేమ్స్ ఆడేందుకు వీలుంటుంది. 

ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4500 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 125 వాట్స్ వైర్డ్, 50 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వీడియో గేమ్స్ ఆడుతూ కూడా 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఇందులో ప్రదాన ఆకర్షణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమేరా. ప్రైమరీ కెమేరా 50 మెగాపిక్సెల్‌తో 3 కెమేరా సెటప్ ఉంటుంది. 

ఇక Motorola Edge 40 Pro ధర గురించి అధికారికంగా ఏం తెలియకపోయినా దాదాపుగా 44 వేల 999 వేలు ఉండవచ్చని అంచనా. ప్రారంభ ఆఫర్, వివిధ బ్యాంకు కార్డుల ఆఫర్ల మినహాయిస్తే ధర మరింతగా తగ్గవచ్చు. 

Also read: PM Mudra Loan: రూ.10 లక్షల రుణం ఏ హామీ లేకుండా కావాలా? ఇలా వెంటనే అప్లై చేసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News