Oneplus U Series: అన్ని రకాల వస్తువులపై రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కామర్స్ సైట్స్ ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. ఈ ఆఫర్స్ లో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులైన టీవీ, స్మార్ట్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. అయితే ఈ ఆఫర్లను చూసి ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా తమ వెబ్సైట్లో భారీ డిస్కౌంట్లతో వస్తువులను విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ టీవీ లపై దాదాపు 14 నుంచి 25% దాకా డిస్కౌంట్తో విక్రయిస్తున్నాయి అంటే నమ్మశక్యం లేదు కదా..!
వన్ ప్లస్ వెబ్సైట్లో ఇటీవల మార్కెట్ లోకి విడుదల చేసిన 65-అంగుళాల వన్ ప్లస్ టీవీ యు(OnePlus TV U) సిరీస్ టీవీ పై బంపర్ తగ్గింపుతో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. రిపబ్లిక్ డే ఆఫర్స్ సందర్భంగా రూ. 69,999 ఉండే ఈ స్మార్ట్ టీవీ.. కేవలం రూ.59, 999లకే పొందవచ్చు. అంతేకాకుండా మీరు ఈ టీవీని ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 4,000 దాకా డిస్కౌంట్ లభించనుంది.
ఈటీవీ ఫీచర్ల పరంగా మార్కెట్లో సంచలనం సృష్టించింది. డాల్బీ సౌండ్ సిస్టం తో పాటు చాలా రకాల ఫీచర్లను కలిగి ఉంది ఈ టీవీ.. అయితే ఇందులో ఉన్న ఇతర ఫీచర్లు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
OnePlus TV U ఫీచర్లు, స్పెసిఫికేషన్స్:
OnePlus TV U టీవీలో కంపెనీ 3840x2160 పిక్సెల్ రిజల్యూషన్‌తో 66.5-అంగుళాల LED డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్ప్లే HDR10+ సర్టిఫికేట్ పొందింది. విజువల్స్ క్లారిటీ విషయానికొస్తే.. వినియోగదారులను ఆకర్షించేందుకు గామా ఇంజిన్‌ను కూడా అందిస్తోంది. సౌండ్ కోసం ఈ టీవీలో రెండు శక్తివంతమైన స్పీకర్స్ తో పాటు 30 వాట్ల ఆడియో అవుట్‌పుట్‌ను దించనుంది. సౌండ్ క్వాలిటీని థియేటర్ లాగా చేయడానికి డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఇందులో అందిస్తోంది కంపెనీ..
ఇతర ఫీచర్లు:
>>2GB RAM , 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
>>Chromecastతో కూడిన ఈ టీవీ Android 10 OS పై పని చేస్తుంది.
>>Miracast, Multicast Alexa ఆపరేట్ చేయొచ్చు.
>>ఆక్సిజన్ ప్లే, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ ప్లే స్టోర్ సపోర్టు కూడా లభిస్తుంది.
>>కనెక్టివిటీ కోసం..మూడు HDMI 2.1, రెండు USB 2.0, ఒక ఆప్టికల్ డిజిటల్ ఆడియో అవుట్‌పుట్ లు ఉన్నాయి.
>>వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0
>>వై-ఫై స్టాండర్డ్
>>OnePlus Connect 2.0 స్మార్ట్‌ఫోన్ కనెక్ట్
ఇది కూడా చదవండి : Republic Day 2023: రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు, చీఫ్ గెస్ట్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు
ఇది కూడా చదవండి : Parliament New Building Photos: పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఫోటోలు.. పాతదానికి, కొత్తదానికి డిజైన్ తేడా చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook