POCO C65 Price Cut: అతి తక్కువ ధరల్లో లభించే స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా రెడ్‌మీ, రియల్ మీ, పోకో బ్రాండ్ లాంచ్ చేసే మిడిల్ రేంజ్ ఫోన్స్‌ను మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. వీటిని చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీలు అతి తక్కువ ధరలకే మంచి మంచి మొబైల్‌ను లాంచ్ చేస్తున్నాయి. గతంలో విడుదలైనా POCO C65 స్మార్ట్‌ఫోన్ భారీగా సేల్ అవుతోంది. ఇది అతి చౌకగా లభించడంతో చాలా మంది దీనిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో అతి తక్కువ ధరలోనే మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిఫ్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌లో లభిస్తోంది. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ POCO C65 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా మూడు స్టోరేజ్ వేరియంట్స్‌లో లభిస్తోంది. ప్రస్తుంత 128 GB స్టోరేజ్ కలిగిన మొబైల్ MRP ధర రూ.10,999తో లభిస్తోంది. అయితే దీనిని ఇప్పుడే ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే దాదాపు 36 శాతం తగ్గింపుతో కేవలం రూ.6,999కే పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై ఉన్న బ్యాంక్ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి మరింత తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే క్లియర్ ట్రిప్ హోటల్స్‌కి సంబంధించిన ప్రత్యేకమైన కూపన్ కూడా లభిస్తుంది. ఇవేకాకుండా ఈ మొబైల్‌పై ఇతర కాంబో ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
POCO C65 టాప్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
అద్భుతమైన డిస్ప్లే: POCO C65 6.74 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ప్లేతో వచ్చింది. ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో సూపర్ స్మూత్ విజువల్స్ అందిస్తుంది.
పవర్‌ఫుల్ ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌పై ఈ మొబైల్ పని చేస్తుంది. ఇది సున్నితమైన మల్టీటాస్కింగ్, మంచి గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
అధిక స్టోరేజ్: 8GB వరకు ర్యామ్‌తో పాటు 256GB వరకు స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. మీకు అవసరమైన అన్ని ఫైల్స్, యాప్స్, ఫోటోలు, వీడియోలను ఈ ఫోన్‌లో స్టోర్ చేసుకోవచ్చు.
అద్భుతమైన కెమెరాలు: ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది.
శక్తివంతమైన బ్యాటరీ: ఇది 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కాబట్టి రోజంతా ఎంత వాడిన బ్యాటరీ తగ్గకుండా ఉంటుంది. దీంతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14: లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో మెరుగైన యూజర్ ఇంటర్‌ఫేస్, సెక్యూరిటీ ఫీచర్స్‌తో అందుబాటుకి వచ్చింది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్: ఫోన్‌ను సురక్షితంగా ఉంచడానికి సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది.
కనెక్టివిటీ ఆప్షన్లు: 4G, Wi-Fi, బ్లూటూత్ 5.1, GPS లతో అన్ని కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
3.5mm ఆడియో జాక్: మీ ఇష్టమైన వైర్డ్ హెడ్‌ఫోన్లను కనెక్ట్ చేయడానికి 3.5mm ఆడియో జాక్ ఉంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి