Air India For Sale: అమ్మకానికి ఎయిర్ ఇండియా, కొనేదెవరో తెలుసా

Air India For Sale: ఎన్‌డీఏ 2 ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగా ఎయిర్ ఇండియా ఇప్పుడు మరోసారి అమ్మకానికి సిద్ధమైంది. విలువ ఎంతంటే  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 15, 2021, 01:30 PM IST
  • మరోసారి అమ్మకానికి సిద్ధమైన ఎయిర్ ఇండియా
  • ఎయిర్ ఇండియా కొనుగోలుకు బిడ్స్ దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 15 చివరి తేదీ
  • ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్న టాటా గ్రూప్, స్పైస్ జెట్
Air India For Sale: అమ్మకానికి ఎయిర్ ఇండియా, కొనేదెవరో తెలుసా

Air India For Sale: ఎన్‌డీఏ 2 ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగా ఎయిర్ ఇండియా ఇప్పుడు మరోసారి అమ్మకానికి సిద్ధమైంది. విలువ ఎంతంటే

ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం( Central government) కీలక నిర్ణయం తీసుకుంది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్ని వదిలించుకునేందుకు సిద్ధమైంది. ప్రభుత్వరంగ సంస్థల్లోని ప్రభుత్వ పెట్టుబడుల్ని ఉపసంహరించుకునే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియాను మరోసారి అమ్మకానికి సిద్ధం చేసింది. ఎందుకంటే ఎయిర్ ఇండియా నిర్వహణపరమైన లోపాలతో నష్టాల పాలైంది. ఇప్పటి వరకూ ఎయిర్ ఇండియా నష్టాలు 43 వేల 3 వందల కోట్లుగా తేలింది. దాంతో ఎయిర్ ఇండియాను అమ్మేందుకే నిర్ణయించింది. ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఆసక్తి చూపించే కంపెనీలు బిడ్ దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 15, 2021 చివరితేదీగా(Air India Bidding Last Date) నిర్ణయించారు. మరోసారి గడువు పెంచమని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు.

వాస్తవానికి ఎయిర్ ఇండియాను(Air India) కేంద్ర ప్రభుత్వం 2018లోనే అమ్మకానికి పెట్టింది. కనీసం 76 శాతం వాటాను కొనుగోలు చేయాలనేది షరతుగా ఉంది. కారణాలు తెలియదు కానీ ఏ ఒక్క కంపెనీ కూడా కేంద్రం విధించిన షరతులతో ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. దాంతో మరోసారి ఎయిర్ ఇండియా అమ్మకానికి బిడ్స్ ఆహ్వానించింది. ఈసారి రెండు సంస్థలు కలిపి బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చంటూ మినహాయింపు ఇచ్చింది. వందశాతం వాటాను అమ్మేయాలని నిర్ణయించింది. ఎయిర్ ఇండియా కొనుగోలుకు టాటా గ్రూపుతో పాటు స్పైస్‌జెట్ సంస్థలు ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమచారం. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం ఈ రెండు సంస్థలు కలిసి బిడ్ దాఖలు చేయవచ్చని తెలుస్తోంది. ఎయిర్ ఇండియా నష్టాల్లో ఉన్నా సరే కొనుగోలుకు కంపెనీలు ఆసక్తి చూపించేందుకు కారణాలున్నాయి.ఎయిర్ ఇండియా వద్ద కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్థులున్నాయి. ముంబై, ఢిల్లీ నగరాల్లో నడిబొడ్డున ఎకరాల్లో విలువైన స్థలముంది. దేశంలోని అన్ని ముఖ్య నగరాల్లో సిబ్బంది క్వార్టర్స్ రూపంలో ఆస్థులు ఎయిర్ ఇండియాకు ఉన్నాయి. దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఎయిర్ ఇండియాకు ఆస్థులుండటం గమనార్హం.

Also read: T20 World Cup: టీ20 ప్రపంచకప్ ఇండియా జట్టు ఎంపికపై గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News