Alert for HYD MMTS passengers: హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సోమవారం (జనవరి 17) సికింద్రాబాద్ పరిధిలో 36 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది. ప్రస్తుతం సికింద్రాబాద్ పరిధిలో ట్రాక్ మరమ్మత్తుల పనులు నడుస్తున్నాయి. దీనికి తోడు సాంకేతిక కారణాలతో సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
రద్దయిన ఎంఎంటీఎస్ సర్వీసుల వివరాలు :
లింగంపల్లి-హైదరాబాద్ (9 సర్వీసులు)
ట్రైన్ నెంబర్స్-47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140
హైదరాబాద్-లింగంపల్లి (9 సర్వీసులు)
ట్రైన్ నెంబర్స్-47105,47109,47110,47111,47112,47114,47116,47118,47120
ఫలక్‌నుమా-లింగంపల్లి (8 సర్వీసులు)
ట్రైన్ నెంబర్స్-47153,47164,47165,47216,47166,47203,47220,47170
లింగంపల్లి-ఫలక్‌నుమా (8 సర్వీసులు)
ట్రైన్ నెంబర్స్-47176,47189,47186,47210,47187,47190,47191,47192
సికింద్రాబాద్-లింగంపల్లి (1 సర్వీసు)
ట్రైన్ నెంబర్-47150
లింగంపల్లి-సికింద్రాబాద్ (1 సర్వీసు)
ట్రైన్ నెంబర్-47195
రైల్వే ట్రాక్ మరమ్మతుల పనులతో గత రెండు రోజులుగా (జనవరి 15, 16) పలు ఎంఎంటీఎస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే (Indian Railway) రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరమ్మతులు ఇంకా కొనసాగుతుండటంతో మరో రోజు పాటు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రైళ్ల రద్దు నేపథ్యంలో ఎంఎంటీఎస్ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
Also Read: Dharmapuri Srinivas: కాంగ్రెస్‌లో డీఎస్ రీఎంట్రీకి ముహూర్తం ఖరారు... చేరిక ఎప్పుడంటే
Also Read: Nandamuri Balakrishna : చీరాల బీచ్‌లో భార్య వసుంధరతో బాలయ్య సందడి.. ఓపెన్ టాప్ జీపులో చక్కర్లు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook