Heavy Rains Alert: గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. రానున్న 3 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఇవాళ తెలంగాణలోని ఈ 7 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత రెండ్రోజులుగా అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో మొన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా అల్పపీడనం నేపధ్యంలో తెలంగాణలోని ఈ 7 జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయి. నిన్న కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. జనగామ జిల్లా దేవరుష్పలో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదముందని, ప్రజలు పొలాల్లో, చెట్ల కింద ఉండవద్దని సూచించింది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, నంద్యాల అనకాపల్లి, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడవచ్చు.
Also read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దీక్షల వెనుక పెద్ద వ్యూహమే ఉందా, తెరవెనుక ఏం జరుగుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.