హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు: చంద్రబాబుతో ఉత్తమ్ కుమార్‌ భేటీ..?

శాసనసభ రద్దు కావడంలో తెలంగాణలో ఒక్కసారిగా ముందస్తు హీట్ పెరిగిపోయింది.

Last Updated : Sep 8, 2018, 06:47 PM IST
హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు: చంద్రబాబుతో ఉత్తమ్ కుమార్‌ భేటీ..?

శాసనసభ రద్దు కావడంలో తెలంగాణలో ఒక్కసారిగా ముందస్తు హీట్ పెరిగిపోయింది. శనివారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీకానున్నారు. తెలంగాణలో పొత్తులపై పార్టీ నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మధ్యాహ్నం 2.30 గంటలకు టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. పొత్తులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరుగనుంది.

శనివారం చంద్రబాబు.. హైదరాబాద్‌లో ఓ ప్రవేట్ కార్యక్రమంలో (నందమూరి హరికృష్ణ పెద్ద కర్మ) పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ నేతలు హాజరు కానున్నారు.

మరోవైపు ఇవాళ చంద్రబాబును టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కలిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఇరు పార్టీల మధ్య పొత్తుపై ఇరు నేతలు చర్చించే అవకాశం ఉంది.  చంద్రబాబుతో ఉత్తమ్‌ భేటీ తర్వాత కాంగ్రెస్‌, టీడీపీల మధ్య పొత్తపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి..  టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. ఈ విషయమై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో శనివారం హైదరాబాద్‌లో చర్చలు జరుపనున్నట్లు పేర్కొన్నారు.

Trending News