Attack on vikarabad incident facts came out: వికారబాద్ లో కలెక్టర్ పై దాడి ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. లగిచెర్లు గ్రామంలో ఫార్మాకంపెనీకి కోసం భూ కేటాయింపుల అంశంపై మాట్లాడేందుకు వచ్చిన కలెక్టర్ తో పాటు అధికారుల్ని సైతం గ్రామస్థులు పరిగెత్తించి మరీ కొట్టారు. అయితే.. ఈ ఘటన తర్వాత ఒక్కసారిగా రేవంత్ సర్కారు సీరియస్ అయ్యింది. భారీగా ఆ ప్రాంతంలో పోలీసుల్ని మోహరించినట్లు తెలుస్తొంది. ఇంటర్నేట్ సేవలు సైతం బంద్ చేయించారని సమాచారం.
అంతే కాకుండా.. ఈ ఘటన వెనుకాల బీఆర్ఎస్ కుట్ర ఉందని కూడా బైటపడినట్లు తెలుస్తొంది. కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కావాలని గ్రామంలో పిలిపించుకుని తీసుకెళ్లడంలో సురేష్ అనే వ్యక్తి ముందుగానే ప్లాన్ వేశాడంట. అంతే కాకుండా..సురేష్ దాడి జరిగే కొన్ని గంటల ముందు పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా.. సురేష్ తో మాట్లాడుతూ 6 సార్లు కేటీఆర్‌తో ఫోన్లో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు సమాచారం.
మరొవైపు.. సురేష్‌పై ఇప్పటికే అత్యాచారం కేసుతో సహా పలు కేసులు ఉన్నట్లు సమాచారం. చెల్లెలి వరస అయ్యే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినందుకు అతడిపై అత్యాచారం చేశాడంట. సురేష్‌పై కేసులు తొలగించేలా పట్నం నరేందర్ రెడ్డి సహాయం చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. అయితే.. ప్రస్తుతం ఈఘటనపై డీజీపీ సైతం.. వికారాబాద్ కు ఏడీజీ మహేష్ భగవత్‌కు పంపించారంట. ఆయన ఇప్పటికే రంగంలోకి దిగి ఘటనపై వివరాలు సేకరించాలని తెలుస్తొంది. ఈ దాడి ఘటనపై మహేష్ భగవత్ ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తొంది.
Read more: Vikarabad: నన్నెవరు ఉర్కించి కొట్టలేదు.. వికారాబాద్ ఘటనపై క్లారిటీ ఇచ్చిన కలెక్టర్.. వీడియో ఇదే..
ఇదిలా ఉండగా.. వికారాబాద్ జిల్లా లగ్గిచర్లలో, పొలెపల్లి, హీకంపేట గ్రామంలో.. ఫార్మాకంపెనీ ఏర్పాటు చేసేందుకు మూడు వేల ఎకరాల సేకరణకు అధికారులు వచ్చినట్లు తెలుస్తొంది. దీంతో ప్రభుత్వం తమ భూములు లాక్కుంటుందని కూడా.. అధికారులపై మూకుమ్మడిగా దాడులు చేసినట్లు తెలుస్తొంది. అయితే.. కలెక్టర్ మాత్రం తనను ఎవరు కొట్టలేదని, దాడి చేయలేదని చెప్పడం మాత్రం బిగ్ ట్విస్ట్ గా చెప్పుకొవచ్చు. అయితే.. దాడికి పాల్పడిన వారిని దాదాపు.. 300 ల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది.