Protest Against Ban on Bajarang Dal: భజరంగ దళ్‌ను నిషేధించడం అంటే హనుమంతుడిని చెరసాలలో బంధించడమే అవుతుంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. భజరంగ్ దళ్‌ను నిషేధిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనను నిరసిస్తూ రేపు శుక్రవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఎదుట ప్రజాస్వామ్యబద్దంగా ‘‘హనుమాన్ చాలీసా’’ పఠనం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కొద్దిసేపటి క్రితం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జ్ లు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పీఎఫ్ఐపై నిషేధం ఎత్తేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ భజరంగ దళ్‌ను నిషేధిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం దుర్మార్గం. ఈ విషయంపై దేశవ్యాప్తంగా హిందూ సమాజం ఎంతో ఆగ్రహంతో ఉంది అని బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హిందూ ద్రోహిగా అభివర్ణించిన బండి సంజయ్.. హిందూ ధర్మానికి ఆపదొస్తే ముందుండి పోరాడే సంస్థ భజరంగ్ దళ్. గోరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న సంస్థ భజరంగ దళ్ సంస్థను నిషేధించాలనుకోవడం దుర్మార్గం. ఇప్పుడు అడ్డుకోకపోతే తెలంగాణలో కూడా భజరంగ్ దళ్‌ను నిషేధించే ప్రమాదం ఉంది అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ఎదుట, కాంగ్రెస్ నేతల ఇళ్ల ఎదుట హనుమాన్ చాలీసా పఠనం చేస్తూ శాంతియుత మార్గంలో కాంగ్రెస్ పార్టీపై నిరసన తెలపాలి అని అన్నారు. అందులో భాగంగా ప్రతీ కార్యకర్త కాషాయ కండువా ధరించి నిరసన తెలపాలి. పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడే హనుమాన్ చాలీసా పఠిస్తూ నిరసన తెలపాలి అని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.
ఇది కూడా చదవండి : BRS Party in Maharashtra: నేనే మహారాష్ట్రకు నేర్పుతున్నా.. సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఒక్క బీజేపీ కార్యకర్త, మోర్చా కార్యకర్తలు కాషాయ జెండా పట్టుకుని, కండువాలు ధరించి హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా నిరసన తెలపాలి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపి పార్టీ నేతలు, కార్యకర్తలు అందరికీ బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సూచనలు జారీచేశారు. తమ నాయకుడు బండి సంజయ్ కుమార్ పిలుపుతో రేపు కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లు, ఎక్కడికక్కడ పార్టీ కార్యాలయాలు చుట్టుముట్టేందుకు బీజేపి నేతలు సిద్ధం అవుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న భజరంగ్ దళ్‌పై నిషేధం అంశం మొత్తానికి తెలంగాణలోనూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : Crop Loss Compensation: పంట నష్టపరిహారంపై బండి సంజయ్‌కి బాజిరెడ్డి కౌంటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK