TSRTC Chairman Bajireddy Govardhan: తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజి రెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. బండి సంజయ్ భాష చూస్తే ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో లేదన్న బాజిరెడ్డి.. అలాంటి నాయకుడు ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం బీజేపీ చేసుకున్న దురదృష్టం అని ఎద్దేవా చేశారు. రైతులకు పంట నష్టం పరిహారంపై బండి సంజయ్ చేస్తోన్న వ్యాఖ్యలు అర్థరహితం, హాస్యాస్పదంగా ఉన్నాయి. బండి సంజయ్ వ్యాఖ్యలు దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నాయని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అసలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఏం న్యాయం చేస్తున్నారో చెప్పి ఆ తరువాతే తెలంగాణ గురించి మాట్లాడాలన్నారు.
తెలంగాణలో అకాల వర్షాలతో రైతులు భారీగా నష్టపోతున్నప్పటికీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫీల్డ్ కు వెళ్లడం లేదంటున్న బండి సంజయ్ కి కళ్లు, చెవ్వులు లేవా అని బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. కేసీఆర్ స్వయంగా ఖమ్మం వెళ్లి పంట నష్టం చూడలేదా ? కేసీఆర్ వెళ్లొచ్చిన తర్వాత వచ్చిన నివేదికల మేరకే కదా మొన్ననే పంట నష్టానికి సంబంధించి 151 కోట్ల రూపాయల విడుదల ఫైలుపై మంత్రి హరీష్ రావు సంతకం చేశారు అని వ్యాఖ్యానించారు. వాట్సాప్ యూనివర్సిటీల్లో అబద్దాలు ప్రచారం చేస్తూ బీజేపీ పబ్బం గడుపుకుంటోందన్నారు.
ఇప్పటివరకు తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ 4.50 లక్షల కోట్ల మేర ఖర్చు చేశారు. మరి అదే రైతుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారో బండి సంజయ్ ప్రశ్నించాలన్నారు. బండి సంజయ్‌కి తెలివితేటలు ఉంటే రైతులకు అదనంగా మరో పది వేలు ఇప్పించాలి అని డిమాండ్ చేసిన బాజిరెడ్డి గోవర్థన్.. కేంద్రం నుంచి ఇప్పించే మొహం లేదు కానీ ఇక్కడకొచ్చి మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీకి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు. తెలంగాణ మోడల్ అంటేనే రైతులకు మేలు చేసే మోడల్. గుజరాత్ మోడల్ అంటే మోసం చేసి పారిపోయే మోడల్ అని గుజరాత్ కి తెలంగాణకు మధ్య తేడాలపై బాజిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
భారతీయ జనతా పార్టీకి వ్యక్తిగతమైన ఆరోపణలు చేయడం తప్పించి ఇంకొకటి చేతకాదు. మేము ఏదైనా ఆరోపణలు చేస్తే వాటిని నిరూపించి తీరుతాం. బీజేపీ ఇలా అబద్దాలు చెబుతూ, అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఎన్ని రోజులు బతుకుతుందన్నారు. కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం. మహారాష్ట్రలో కూడా అదే జరుగుతుందని.. దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి శిక్ష విధించడం ఖాయం అని బాజిరెడ్డి గోవర్ధన్ జోస్యం చెప్పారు.
రైతుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు...
తెలంగాణ మోడల్ అంటేనే రైతులకు మేలు చేసే మోడల్ : ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్@Govardhan_MLA pic.twitter.com/vaODbY0gSy— BRS Party (@BRSparty) May 3, 2023
ఇది కూడా చదవండి : Horrible Road Accident: భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్.. అతి వేగంగా వచ్చి పోలీసుని ఢీకొట్టిన కారు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పైనా విమర్శలు ఎక్కుపెట్టిన బాజిరెడ్డి గోవర్ధన్.. మా ఎంపీ గుండు అరవింద్ కూడా నయా పైసాకు పనికి రాడని మండిపడ్డారు. అరవింద్ కు అబద్దాలు తప్ప ఏమీ రావు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడం కాదు కానీ.. బండి సంజయ్‌కు చేతనైతే కేంద్రం నుంచి పది వేల రూపాయలు ఇప్పించాలి అని బాజిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ నేతలు తప్ప మిగతా ప్రజలు అందరూ సంతోషంగానే ఉన్నారు. బీజేపీ అబద్దాలు, మోసాలు పల్లెపల్లెనా ఎండగట్టి బీజేపి అసలు రూపాన్ని బయటపెడతాం అని బీజేపిని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ సచివాలయం కడితే తప్పు అవుతుంది కానీ ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్ కడితే ఒప్పు ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. బీజేపీ నేతల తీరు చూసి ప్రజలే ఛీ కొడుతున్నారు. బండి సంజయ్‌కు పిచ్చి లేచింది. అందుకే తక్షణమే బండి సంజయ్‌ని పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాలి అని బాజిరెడ్డి గోవర్థన్ బీజేపి నేత బండి సంజయ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇది కూడా చదవండి : Money Earning Business Ideas: ఏడాదికి 40 లక్షల లాభం తెచ్చిపెట్టిన బిజినెస్
ఇది కూడా చదవండి : Stocks to Buy Today: రూ 100 కంటే తక్కువ ధరలోనే రాబోయే 2 - 3 నెలల్లో 46% వరకు రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK