Bathukamma Sarees: తెలంగాణలో రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ జరగనుంది. మొత్తం కోటి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. విభిన్న రకాల డిజైన్లతో తయారు చేసిన చీరలను అందజేయనున్నారు. 92.00 లక్షల రెగ్యులర్ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయో వృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్లు పొడవు గల 8 లక్షల చీరలను అందుబాటులో ఉంచారు. ఇందుకు మొత్తం రూ.339.73 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెట్టింది.
ఈకార్యక్రమంతో నేతన్న జీవితాల్లో వెలుగులు నిండుతాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈసారి కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుక ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రేపటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ జరగనుంది. నేతన్నలకు చేయూత ఇచ్చేందుకు, ఆడ్డ బిడ్డలకు చిరు కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈకార్యక్రమాన్ని 2017లో ప్రారంభించినట్లు తెలిపారు.
చీరల పంపిణీ కార్యక్రమం కోసం అన్ని జిల్లాల కలెక్టర్లు సమన్వయం చేసుకుంటూ..తమ టెక్స్ టైల్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నేతన్నలకు సరైన ఉపాధిలేక ఇబ్బందులు పడ్డారన్నారు కేటీఆర్. ఐతే స్వరాష్ట్రం ఏర్పడ్డాకే వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. నేతన్నల కోసం ప్రత్యేక బీమా తెచ్చామని గుర్తు చేశారు. ఐతే టెక్స్‌టైల్ ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం ద్వారా నేతన్నలపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్.
కేంద్రం నుంచి సహకారం లేకున్నా చేనేత రంగానికి అండగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇందులోభాగంగానే ఈసారి కూడా సుమారు కోటి బతుకమ్మ చీరలను తయారు చేయించామని..దీని వల్ల నేతన్నలకు ఉపాధి కల్గుతుందన్నారు మంత్రి కేటీఆర్. గతంలో కంటే విభిన్నంగా ఎన్నో డిజైన్లు, రంగుల, వైరెటీల్లో చీరలను తయారు చేశామని తెలిపారు. మహిళల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తయారు చేశామన్నారు.
మొత్తం 240 రకాల డిజైన్లతో వీటిని తయారు చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. యువతులు, మహిళలు, వృద్దులు ధరించేలా విభిన్న చీరలను తయారు చేయించామన్నారు. రేషన్ కార్డు కల్గి ఉన్న ప్రతి ఒక్క ఆడ బిడ్డకు వీటిని అందిస్తామని తెలిపారు. ఇందుకు మొత్తం రూ.339.73 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. 2017 నుంచి ఇప్పటివరకు సుమారు 5 కోట్ల 81 లక్షల చీరలను పంపిణీ చేశామన్నారు మంత్రి కేటీఆర్.
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అల్పపీడనం ఎఫెక్ట్..రాగల మూడు రోజులపాటు వానలే వానలు..!
Also read:Telangana Congress: రాహుల్ గాంధీయే బాస్‌గా ఉండాలి..తెలంగాణ కాంగ్రెస్ కీలక తీర్మానం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.