Telangana Congress: రాహుల్ గాంధీయే బాస్‌గా ఉండాలి..తెలంగాణ కాంగ్రెస్‌ కీలక తీర్మానం..!

Telangana Congress: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని ఆ పార్టీ నేతలు ఆకాంక్షిస్తున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ కీలక తీర్మానం చేసింది.

Written by - Alla Swamy | Last Updated : Sep 21, 2022, 03:23 PM IST
  • తెలంగాణ కాంగ్రెస్‌ కీలక తీర్మానం
  • రాహుల్ గాంధీనే బాస్‌ కావాలని ఆకాంక్ష
  • ఆమోదించిన నేతలు
Telangana Congress: రాహుల్ గాంధీయే బాస్‌గా ఉండాలి..తెలంగాణ కాంగ్రెస్‌ కీలక తీర్మానం..!

Telangana Congress: అగ్ర నేత రాహుల్ గాంధీని ఏఐసీసీ చీఫ్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని కోరుతూ టీపీసీసీ తీర్మానం ప్రవేశపెట్టింది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా..ఆ పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానాన్ని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ బలపరిచారు. ఇతర నేతలు ఏకగ్రీవం చేశారు. రాజకీయ తీర్మానాన్ని ఆ పార్టీ నేత షబ్బీర్ ఆలీ ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బలపరిచారు. 

రాజకీయ తీర్మానాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, ఆ పార్టీ నేతలు మధు యాష్కీ, దామోదర్ రాజనరసింహ, వి. హనుమంతరావు, మహేష్‌కుమార్ గౌడ్‌లు బలపరిచారు. మరోవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు తీర్మానాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీనే బాస్‌ కావాలని ఆకాంక్షిస్తున్నారు. పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబం వద్దే ఉండాలని..అప్పుడే క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌ బలపడుతుందని అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎన్నోసార్లు ఇదే రుజువయ్యిందంటున్నారు.

ఈసందర్భంగా బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కమలనాథులు విధ్వేషాన్ని నింపుతున్నారన్నారు. దేశం కోసం తన ప్రాణ త్యాగం చేసేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని..అందుకే పాదయాత్ర చేపట్టారని స్పష్టం చేశారు. మోదీ పాలనలో దేశం సంక్షోభంలో ఉందని విమర్శించారు. బీజేపీ నుంచి దేశాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని గుర్తు చేశారు. 

తెలంగాణలో రాహుల్ సభను సక్సెస్ చేస్తామన్నారు. వచ్చే నెలలో భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుందని..మూడు వారాలపాటు ఆయన రాష్ట్రంలో ఉంటారని తెలిపారు. ఈసందర్భంగా తెలంగాణలో భారీ బహిరంగ సభలు చేపడుతామన్నారు. ఇందుకు పార్టీ నేతలతో కలిసి ప్రణాళికలు రచిస్తున్నామన్నారు రేవంత్‌రెడ్డి. ఇటీవల భారత్ జోడో యాత్రకు ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ దాకా యాత్ర సాగనుంది. 

ప్రస్తుతం కేరళలో పాదయాత్ర కొనసాగుతోంది. భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తోంది. అడుగడుగునా రాహుల్ గాంధీకి ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు. ఈసందర్భంగా వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also read:Dussehra Holidays: ఈనెల 26 నుంచే దసరా సెలవులు.. టీచర్లు పండగ చేసుకోండి..!

Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అల్పపీడనం ఎఫెక్ట్..రాగల మూడు రోజులపాటు వానలే వానలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News