Water Supply: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. 24 గంటలు నీటి సరఫరా బంద్

24 Hours Drinking Water Supply Disruption In Hyderabad: హైదరాబాద్‌లో 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు అధికారులు ప్రజలకు భారీ ప్రకటన ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 23, 2024, 11:02 PM IST
Water Supply: హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. 24 గంటలు నీటి సరఫరా బంద్

Drinking Water Supply Disruption: హైదరాబాద్‌ ప్రజలకు భారీ అలర్ట్‌. రేపు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొన్ని పనుల రీత్యా తాగునీటి సరఫరా ఉండదని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా హైదరాబాద్‌ ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. హైదరాబాద్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ నీటి సరఫరా ఉండదని వెల్లడించింది. ఏయే ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే వివరాలు తెలుసుకోండి.

Also Read: Tirumala Letter: తిరుమలపై మళ్లీ రెచ్చిపోయిన తెలంగాణ ఎమ్మెల్యే.. ఈసారి చంద్రబాబును అడ్డుకుంటామని వార్నింగ్‌

 

హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా తాగునీటి సరఫరా ఫేజ్-3లోని 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌కు లీకేజీ ఏర్పడడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ లీకేజీని మరమ్మతు చేసేందుకు కానీ పనులు చేపడుతున్నారు. ఈ కారణంతో తాగునీటి సరఫరా ఆగనుంది. 24వ తేదీ గురువారం ఉదయం 6 నుంచి మరుసటి రోజు 25 శుక్రవారం ఉదయం 6 గంటల వరకు పనులు చేపట్టనున్నారు. ఈ 24 గంటలపాటు కింది రిజర్వాయర్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో ఆటంకం ఏర్పడుతుందని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ తెలిపింది.

Also Read: KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్‌

 

నీటి సరఫరా ఉండని ప్రాంతాలు
హైదరాబాద్‌లో దాదాపు అన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. శాస్త్రీపురం, బండ్లగూడ, భోజగుట్ట, షేక్‌పేట్, ఆళ్లబండ, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, ప్రశాసన్ నగర్, తట్టిఖానా, లాలాపేట్, సాహేబ్ నగర్, ఆటోనగర్, సరూర్ నగర్, వాసవి రిజర్వాయర్లు, సైనిక్ పురి, మౌలాలి, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావురి హిల్స్, స్నేహపురి, కైలాసగిరి, దేవేంద్రనగర్, మధుబన్, దుర్గానగర్, బుద్వేల్, సులేమాన్ నగర్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్, కిస్మత్ పూర్, గంధంగూడ, బోడుప్పల్, మల్లికార్జున నగర్, మాణిక్ చంద్, చెంగిచెర్ల, భరత్ నగర్, పీర్జాదిగూడ, పెద్ద అంబర్ పేట్, ధర్మసాయి (శంషాబాద్) తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అంతరాయం ఏర్పడే ప్రాంతాల్లోని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News