Liquor price hike issue in telangana: తెలంగాణలో మందుబాబులకు ఇది కిక్ పొగొట్టే వార్త అని చెప్పవచ్చు. కొన్నిరోజులుగా వైన్ ల ధరలు పెరుగుతాయని అనేక ఊహగానాలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో.. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి లిక్కర్ ధరలు పెంచడం కామన్ గా జరిగుతు ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో.. 2022 లో మద్యం ధరలు పెంచుతు నిర్ణయం తీసుకున్నారు. ఇక మరల ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడటానే లిక్కర్ ధరలు పెంచితే నెగెటివ్ మెస్సెజ్ ప్రజల్లోకి వెళ్తుందని..అందుకే కాంగ్రెస్ సర్కారు కొన్నిరోజులు వేచిచూసినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఎన్నికల కూడా ముగియడంతో లిక్కర్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం సన్నాహలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..
మరోవైపు.. లిక్కర్ ధరలను పెంచడం సబబు కాదని కొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు.. కొంత అదనపు ఆదాయం అవసరం. ఈ క్రమంలో ఇప్పుడున్న లిక్కర్ ధరలను పెంచితే..ఏడాదికి మూడువేల నుంచి మూడువేల ఐదువందల అదనపు ఆదాయం సమకూరుతుందని కూడా తెలుస్తోంది. మద్యం అన్నిరకాల బ్రాండ్లపై ఇప్పటికే 20-25 శాతం వరకు ధరలు పెంచేదుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక మద్యం పెంపు వార్తలపై మందుబాబులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వాలు చాలా వరకు మద్యంను ఒక ఆదాయ వనరుగా భావిస్తున్నారు. కానీ మద్యం పెంపును ఇలా ఆదాయ వనరుగా భావించడం సరైన విధానం కాదని చాలా మంది తరచుగా సూచిస్తుంటారు. కానీ ప్రభుత్వాలు మాత్రం .. కొత్త బ్రాండ్లు, లిక్కర్ లపై రేట్లను ఎప్పటికప్పుడు పెంచుతు తమ ఖాజానా ఆదాయం పెంచుకుంటున్నాయి. ఇక మద్యం తాగే వారిలో చాలా మంది.. మిడిల్ లెవల్ బ్రాండ్స్ లను ఎక్కువగా తాగుతుంటారు.
ముఖ్యంగా భవన నిర్మాణాలు, కూలీపనులు, ఇతర పనులు చేసేవారు.. ప్రతిరోజు మద్యం తాగుతుంటారు. వీరు పడిన కష్టం తెలియకుండా.. ఉండేందుకు మద్యంతాగడం అలవాటు చేసుకుంటారు. మరికొన్ని చోట్ల.. మాత్రం మద్యంకు అడిక్ట్ అయిపోయి ఉంటారు. వీరికి డైలీ కొంచెమైన లిక్కర్ వారి పొట్టలోనికి పోవాల్సిందే. పొరపాటున మద్యం దొరక్కపోతే.. కొందరు సైకోలుగా ప్రవర్తిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter