YSRTP: బీఆర్ఎస్‌కు షాక్.. వైఎస్‌ఆర్టీపీలోకి కీలక నేత.. ముహుర్తం ఖరారు

Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రకటన రాకముందే అసంతృప్త నేతలు పార్టీ జంప్ అవుతున్నారు. త్వరలోనే చేరికలు మరింత జోరు అందుకునే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ కీలక నేత వైఎస్ఆర్టీపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2023, 04:19 PM IST
YSRTP: బీఆర్ఎస్‌కు షాక్.. వైఎస్‌ఆర్టీపీలోకి కీలక నేత.. ముహుర్తం ఖరారు

Telangana Politics: తెలంగాణలో ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతున్న వేళ అన్ని రాజకీయ పార్టీలకు టెన్షన్ పట్టుకుంది. ఎవరు ఎటు వైపు జంప్ అవుతారో అర్థంకానీ పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళుతున్నారనే వార్తల నేపథ్యంలో ప్రతిపక్షాలు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టాయి. అధికార పార్టీలో అసంతృప్త నేతలను తమ వైపు ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. 

బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్న ఆయన.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన అనుచరులను కలుస్తున్నారు. బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తూ.. తనకు జరిగిన మోసం గురించి వివరిస్తున్నారు. పొంగులేటి పార్టీ మారడం ఎప్పుడో కన్ఫార్మ్ అయినా.. ఏ పార్టీలోకి చేరతారనే విషయంలో క్లారిటీ రాలేదు. ఇటీవల బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగినా.. ఎందుకో వాయిదా పడింది. 

అయితే తాజాగా పొంగులేటి వైఎస్సాఆర్‌టీపీలో చేరబోతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. వైఎస్ షర్మిలతో ఆయన భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిగా పొంగులేటికి పేరుంది. 2014 ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్సీపీ తరుఫున గెలుపొందారు. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడిగానూ పని చేశారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల్లో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

ఆయన పార్టీ మారినా.. వైఎస్సాఆర్ అభిమానిగా, వైసీపీ మాజీ ఎంపీగా పొంగులేటికి వైఎస్ కుటుంబంతో మంచి సంబంధాలు అలాగే కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే షర్మిలతో పొంగులేటి భేటీ కావటం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆయన వైఎస్సాఆర్‌టీపీలో ఖాయమని ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై వైఎస్ షర్మిల కూడా క్లారిటీ ఇచ్చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమతో టచ్‌లోనే ఉన్నారని చెప్పేశారు. త్వరలోనే తమ పార్టీలో చేరుబోతున్నారని అన్నారు.

ఈ వ్యాఖ్యలకు మరింత బలం చేకురుస్తూ.. వైఎస్ విజయమ్మతో పొంగులేటి సమావేశం కావటం హాట్ టాఫిక్‌గా మారింది. వైఎస్‌ఆర్టీపీలో చేరికపై విజయమ్మతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈనెల 8వ తేదీన పాలేరులో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభలో వైఎస్ విజయమ్మ పాల్గొననున్నారు. ఆ సభా వేదికపైనే పొంగులేటి వైఎస్ఆర్టీపీ తీర్థం పుచ్చుకోబుతున్నారని చర్చ జరుగుతోంది. 

Also Read: Delhi Crime: ఎలా వస్తాయి రా బాబు ఐడియాలు.. గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఆకట్టుకునేందుకు మైనర్లు ఏం చేశారంటే.. 

Also Read: Team India: ఆసీస్‌పై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News