Bandi Sanjay Vs KTR: బిడ్డా.. కేటీఆర్ నీ పొగరు దించుతా.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..

Bandi Sanjay fires on ktr: కేంద్ర మంత్రి బండి సంజయ్ మళ్లీ కేటీఆర్, సీఎం రేవంత్ లపై మండిపడ్డారు. వీరిద్దరు పగలు గొడవలు పడి, రాత్రిపూట దోస్తానా చేసుకుంటున్నారని కూడా ఫైర్ అయ్యారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Nov 8, 2024, 02:39 PM IST
  • మళ్లీ రెచ్చిపోయిన బండి సంజయ్..
  • కేటీఆర్,రేవంత్ లకు సెటైర్ లు..
Bandi Sanjay Vs KTR: బిడ్డా.. కేటీఆర్ నీ పొగరు దించుతా.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..

bandi Sanjay fires on ktr and cm revanth reddy: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తొడుదొంగలని అన్నారు. అంతే కాకుండా.. పగలు కొట్టుకుంటూ రాత్రిపూట ఇద్దరి మధ్య దోస్తానా నడుస్తొందన్నారు. అంతే కాకుండా..  ఈ ఫార్ములా రేస్, రేవ్ పార్టీ, డ్రగ్స్, కాళేశ్వరం, ఫోన్ టాపింగ్ వంటి కేసుల్లో కేటీఆర్ ఉన్న కూడా.. అరెస్ట్ లు చేయడంలేదని మండి పడ్డారు.

ఒకప్పుడు.. జన్వాడ ఫామ్ హౌస్ నుంచి.. డ్రోన్ ఎగిరేశారని.. రేవంత్ కూతురి పెళ్లి ఉండగ కూడా.. అరెస్ట్ చేశారని .. అట్లాంటిది ఇయ్యాళ కేటీఆర్ ఇన్నికేసుల్లో అడ్డంగా బుక్కైన కూడా అరెస్ట్ చేయడంలేదంటూ అర్థం ఏంటని మండిపడ్డారు.కేటీఆర్.. సీఎం రేవంత్ తో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాడని,  పగలు ఇద్దరూ ఫైట్ చేసుకుంటున్నట్లు నటిస్తరు. రాత్రి ఒక్కటైతున్నరని ఎద్దేవా చేశారు.
 
కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం అయితే .. కేటీఆర్ యాక్టింగ్ సీఎం అంటూ సెటైర్లు వేశారు. అందుకే జన్వాఢ బామ్మర్థి ఫాంహౌజ్ కేసులో అడ్డంగా దొరికిన విజయ్ మద్దూరిని, రాజ్ పాకాలపై నామ్ కే వాస్తే కేసులు పెట్టి వదిలేశారన్నారు.

Read more: KTR Vs CM Revanth Reddy: రేవంత్ బర్త్ డే రోజు కేటీఆర్ సర్ ప్రైజ్.. ఆ పనినేనే చేస్తానంటూ సంచలన ట్విట్..

ఈ రేవ్ పార్టీలో కేసీఆర్ కొడుకు ఉన్నడని సోషల్ మీడియా అంతా కోడై కూసినా పట్టించుకోలేదంటూ బండి సంజయ్ ఫైర్ అవుతున్నారు. అంతే కాకుండా.. కేసీఆర్ ..తన కొడుకు బామ్మర్దికేసులో ఏకంగా డీజీపీకి ఫోన్ చేశాడంటే.. దీన్ని బట్టి వారి మధ్య ఉన్న దోస్తానా అర్థం చేసుకొవచ్చని బండిసంజయ్ సెటైర్ లు వేశారు.కేటీఆర్ కు దమ్ముంటే మూసీ పరివాహాక ప్రాంతంలో పాదయాత్ర చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. కేటీఆర్, రేవంత్ తోడుదొంగలని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News