Governor Rejects Names of Two nominated MLCs: బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై షాకిచ్చారు. గవర్నర్ కోటాలో నామినేట్ చేసిన ఇద్దరు అభ్యర్థులను ఆమె తిరస్కరించారు. దీంతో మంత్రులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 10 మంది కార్మిక సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. ప్రభుత్వం వివరణ ఇచ్చిన అనంతరం ఆమోదం తెలుపుతామని గవర్నర్ చెప్పారని కార్మిక సంఘాల నేతలే వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలనే తాను ప్రశ్నలను లేవనెత్తిన్నట్లు చెప్పారు.
Tamilisai Soundararajan: గవర్నర్ తమిళి సై ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి.. బాధితులను గవర్నర్ పరామర్శించనున్నారు.
Harish Rao Comments On Governor Tamilisai Soundararajan: గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్‌పై మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన బిల్లులు ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నారని ప్రశ్నించారు. గవర్నర్‌కు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంటే.. బీజేపీలో చేరి ఎక్కడైనా పోటీ చేయొచ్చన్నారు.
Preethi Suicide Attempt News: ప్రీతిని పరామర్శించడానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆస్పత్రికి వెళ్లిన సందర్భంలో గవర్నర్ వాహనంలో పూల దండ ఉండటంపై రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. ఈ పుకార్లపై స్పందించిన రాజ్ భవన్ అధికారవర్గాలు.. అదొక దుష్ప్రచారంగా కొట్టిపడేశాయి.
MLC Kavitha On Governor Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేకమైన రోజున సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు అంటూ ఆమె ట్వీట్ చేశారు.
Tamilisai Soundararajan: తెలంగాణ రాజకీయాలు..ఢిల్లీకి చేరాయి. ఓ పక్క సీఎం, మరో గవర్నర్ హస్తినలో మకాం వేయనున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంతో సీఎం కేసీఆర్ బీజీ బీజీగా ఉన్నారు. అనంతరం పలువురు ముఖ్య నేతలతో భేటీ కానున్నారు.
Tamilisai Soundararajan: తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల పరస్పర ఆరోపణలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇంతటి పొలిటికల్ హీట్‌లో గవర్నర్ తమిళిసై హస్తిన పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Tamilisai Soundararajan: కేసీఆర్ సర్కార్ పై పోరాటంలో తగ్గేదేలే అంటున్నారు గవర్నర్ తమిళిసై సౌందరాజన్. తన అధికారాలను ఉపయోగిస్తూ ప్రభుత్వానికి షాకులు ఇస్తున్నారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తమిళి సై.. ఇప్పుడు స్వయంగా యాక్షన్ లోకి దిగారు.
Tamilisai Soundararajan News: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అటెండర్ రాజ్ కుమార్ (47) అనుమానాస్పదంగా మృతి చెందారు. సికింద్రాబాద్ లోని స్కందగిరి దేవాలయంలో గవర్నర్ పూజలు నిర్వహిస్తున్న క్రమంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. అయితే అతను గుండెపోటు కారణంగా మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
Governor Tamilisai about Telangana government. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తనపై వివక్ష చూపిస్తోందన్నారు. మహిళా గవర్నర్ అని తనపై వివక్ష చూపిస్తున్నారని ఆవేదన చెందారు.
తెలంగాణ (Telangana) సంస్కృతికి ప్రతీక.. ఆడపడుచుల పూల సంబురం.. బతుకమ్మ పండుగ ( bathukamma festival ). ఈ పూల పండుగ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని.. ప్రకృతి (పూలను) ని దేవతామూర్తిగా భావించి తొమ్మిది రోజులపాటు ఆరాధించడం ఈ బతుకమ్మ ( bathukamma ) పండుక ప్రత్యేకత.
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు సరికావన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకునే సంక్రాంతి పండుగకు మన సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందని వారు పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.