సర్పంచులకు ముచ్చెమటలు పట్టిస్తున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలకు పంచాయత్ రాజ్ చట్టం ప్రాముఖ్యతను, పరిణామాలను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు తెలియజేశారు. 

Last Updated : Feb 21, 2020, 04:26 PM IST
సర్పంచులకు ముచ్చెమటలు పట్టిస్తున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలకు పంచాయతీరాజ్ చట్టం ప్రాముఖ్యతను, పరిణామాలను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు తెలియజేశారు. 

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మార్చి నెలలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఆకస్మిక పర్యటన చేయనున్నారని, కొత్త పంచాయత్ రాజ్ చట్టం ప్రకారం నిర్లక్ష్యం, ఉదాసీనతగా వ్యవహారిస్తే తగు చర్యలు ఉంటాయని అన్నారు. 

సిరిసిల్ల రాజన్న జిల్లాకు చెందిన సర్పంచ్‌లు, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంగా మార్చడమే సీఎం కేసీఆర్ ప్రధాన ధ్యేయమని, పట్టణ ప్రగతి కార్యక్రమం ముగిసిన తర్వాత మార్చి నుండి సీఎం  ఆశ్చర్యకరమైన తనిఖీలకు సిద్ధంగా ఉండాలని, తనకు నచ్చిన గ్రామాన్ని సందర్శిస్తారని పేర్కొన్నారు. మీకు ఏవైనా సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలని, తద్వారా సమస్యల పరిష్కారానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. 

గ్రామాలపై దృష్టి పెట్టండి

రానున్న రెండు నెలల పాటు గ్రామాల్లో నీటిపారుదల, తాగునీటి అవసరాలు, విద్యుత్, గృహనిర్మాణం, వంటి అనేక సంక్షేమ పథకాలతో పాటు వైకుంఠ ధామ నిర్మాణం వంటివి పూర్తి చేయడం సర్పంచ్‌ల విధి అన్నారు. డంపింగ్ యార్డులు, చెట్ల పెంపకం వంటి కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 

కొత్త పంచాయత్ రాజ్ చట్టం చాలా కఠినమైనదని, గ్రామాల్లో జరిగే నిర్లక్ష్యానికి ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాలని, నిధుల వినియోగంపై ప్రజాక్షేత్రంలో ప్రజలకు జవాబు దారిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News