Telangana: కొత్తగా 1,983 కరోనా కేసులు

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 2,02,594కి చేరింది.

Last Updated : Oct 6, 2020, 10:40 AM IST
  • తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి
  • గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,983 కరోనా పాజిటివ్ కేసులు
  • తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 1,181కు పెరిగింది
Telangana: కొత్తగా 1,983 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్  (CoronaVirus) పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,983 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) నమోదయ్యాయి. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 2,02,594కి చేరింది. ఈమేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

సోమవారం రాత్రి 8 గంటల వరకు ఒక్కరోజులో రాష్ట్రంలో 10 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య 1,181కు పెరిగింది. నిన్న ఒక్కరోజు 2,381 మంది కోవిడ్19 నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకూ 1,74,769 (1 లక్షా 74 వేలు) మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 26,644 యాక్టివ్ కేసులుండగా.. అందులో 21,784 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News