Telangana Covid-19: కేసుల కన్నా పెరుగుతున్న రికవరీల సంఖ్య

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. నాలుగు రోజుల నుంచి 1500లకు చేరువలోనే కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కేసుల కన్నా.. రికవరీల సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది.

Last Updated : Oct 22, 2020, 09:19 AM IST
Telangana Covid-19: కేసుల కన్నా పెరుగుతున్న రికవరీల సంఖ్య

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. నాలుగు రోజుల నుంచి 1500లకు చేరువలోనే కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కేసుల కన్నా.. రికవరీల సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో బుధవారం ( అక్టోబరు 21 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,456 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఐదుగురు మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,27,580 కి చేరగా.. మరణాల సంఖ్య 1,292 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Telangana: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,717 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,06,105 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 20,183 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 90.56 శాతం ఉండగా.. మరణాల రేటు 0.56 శాతం ఉంది. 

బుధవారం తెలంగాణ వ్యాప్తంగా 38,565 కరోనా పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటివరకు 39,78,869 టెస్టులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  జీహెచ్ఎంసీ పరిధిలో 254 కేసులు నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 98, రంగారెడ్డి జిల్లాలో 98 కేసులు నమోదు అయ్యాయి. 

Trending News