Telangana Coronavirus Updates: హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్ (Coronavirus) మహమ్మారి కేసులు రోజుకురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో ( డిసెంబరు 31న ) గురువారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 461 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా ఇద్దరు (3) ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also Read: Pfizer-BioNTech వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి WHO అనుమతి
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా (Covid-19) పాజిటివ్ కేసుల (positive cases) సంఖ్య 2,86,815 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,544 కి పెరిగింది. కేసులతోపాటు నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. నిన్న కరోనా నుంచి 617 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,79,456 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 5,815 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.43 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతం ఉంది. Also Read: India Covid-19: గత 24గంటల్లో 20,036 కరోనా కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe