COVID19: తెలంగాణలో తాజాగా 1473 కరోనా కేసులు.. అదొక్కటే ఊరట

CoronaVirus Positive Cases In Telangana |  తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించాలని తెలంగాణ వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Updated: Jul 27, 2020, 02:21 PM IST
COVID19: తెలంగాణలో తాజాగా 1473 కరోనా కేసులు.. అదొక్కటే ఊరట

తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి రాష్ట్రంలో కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 8 గంటలవరకు రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 1,473 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive Cases) నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం  కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య (CoronaVirus Positive Cases In Telangana) 55,532కు చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ రాష్ట్రంలో 8 మంది చనిపోయారు. గురుకులాల్లో నాన్ టీచింగ్ జాబ్స్

తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కోవిడ్19 మరణాల సంఖ్య 471కి చేరిందని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. అదే సమయంలో 774 మంది చికిత్స అనంతరం కరోనా మహమ్మారి నుంచి కోలుకోవడం ఊరట కలిగించే అంశం. మొత్తం కేసులకుగానూ ఇప్పటివరకూ 42,106 మంది డిశ్ఛార్జి కాగా, ప్రస్తుతం తెలంగాణలో 12,955 మంది చికిత్స పొందుతున్నారు. Nithin Wedding Photos: హీరో నితిన్, షాలినిల పెళ్లి వేడుక ఫొటోలు

Image Credit: twitter

దేశంలో మరణాల రేటు 2.3 శాతం ఉండగా.. తెలంగాణలో 0.85శాతం మాత్రమేనని తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. దేశంలో మరణాల రేటు 2.3 శాతం ఉండగా.. తెలంగాణలో 0.85శాతం మాత్రమేనని బులెటిన్‌లో తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 506 కరోనా కేసులు నిర్ధారించగా, రంగారెడ్డిలో 168, సంగారెడ్డిలో 98, కరీంనగర్‌లో 91, మేడ్చల్ మల్కాజిగిరిలో 86 కేసులు నమోదయ్యాయి.  బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..   
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్