TRS Leaders Mike Fight: టీఆర్ఎస్ నేతల మైక్ రచ్చ.. కవిత చేతిలోంచి మైక్ లాక్కున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్‌ చేపట్టిన  రైతు దీక్ష దీక్షలో ఎంపీ కవిత మాట్లాడుతుండగా.. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్‌ లాక్కుకుని మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2022, 04:57 PM IST
  • మహబూబాబాద్‌ జిల్లా టీఆర్ఎస్‌ నేతల మధ్య విభేదాలు
  • మంత్రి సత్యవతి రాథోడ్‌ సమక్షంలో రగడ
  • కవిత నుంచి మైక్‌ లాక్కుకున్న శంకర్‌నాయక్
TRS Leaders Mike Fight: టీఆర్ఎస్ నేతల మైక్ రచ్చ.. కవిత చేతిలోంచి మైక్ లాక్కున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్

TRS Mike Fight: మహబూబాబాద్‌ జిల్లాలో  టీఆర్ఎస్‌ నేతల మధ్య విభేదాలు ముదురుతున్నట్లు కనిపిస్తోంది.  మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో ఈదృశ్యాలు కనిపించాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్‌..రైతు దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. రైతు దీక్షలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ కవిత మాట్లాడుతుండగా.. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ మైక్‌ లాక్కుకుని మాట్లాడారు. ఈఘటనతో బిత్తరబోయిన కవిత..సైడ్‌ అయ్యారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ రవీందర్‌రావుకు చెప్పారు. 

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అధ్యక్షతన కార్యక్రమం జరుగుతోందన్నారు. పక్కానే ఉన్న మరో ఎమ్మెల్యే రెడ్యానాయక్..జిల్లా అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో జరుగుతోందని చెప్పాలని మంత్రికి సూచించారు. ఈదృశ్యాలు నేతల మధ్య ఉన్న విభేదాలను కళ్లకు కట్టినట్లు చూపించాయి. టీఆర్ఎస్‌ నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. పైకి కలిసికట్టుగా ఉన్నట్లు కనిపించినా..నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న వాదన వినిపిస్తోంది. 

తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని సమావేశం తర్వాత నేతలు తెలిపారు. ప్రతి గింజను కేంద్రం కొనేలా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అంతకముందు పట్ణణంలో భారీ ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ ప్రభుత్వ తీరుపై ఈనెల 11 వరకు టీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. 

Also Read: Zuck Bucks: మెటా నుంచి డిజిటల్​ కరెన్సీ.. 'జుక్​ బక్స్' పేరుతో..?

Also Read: Stock Markets: మూడో రోజూ మార్కెట్ల బేజారు.. సెన్సెక్స్ 575 పాయింట్లు డౌన్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News