Vijay Nair in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పాత్ర పోషించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఒక్కొక్కరిగా పిలిచి విచారణ చేపడుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. వారి నుంచి కీలకమైన ఆధారాలు, సమాచారం సేకరించే పనిలో పడింది. అందులో భాగంగానే తాజాగా విజయ్ నాయర్ ని విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. విజయ్ నాయర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాము అనుకున్న విధంగా తమ పని పూర్తి కావడం కోసం ప్రభుత్వంలోని పెద్దలకు విజయ్ నాయర్ రూ. 100 కోట్లు అడ్వాన్స్ రూపంలో చెల్లించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించినట్టు సమాచారం అందుతోంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ తయారీలో ప్రభుత్వంతో ఏ విధమైన సంబంధం లేని విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించారని ఈడీ పసిగట్టింది. అభిషేక్ బోయిన్‌పల్లి, విజయ్ నాయర్.. ఈ ఇద్దరూ కలిసి మద్యం విక్రయాలకు సంబంధించిన హోల్ సేలర్ల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వంలోని పెద్దలకు లంచాలు సమర్పించుకున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విజయ్ నాయర్ కస్టడీ పిటిషన్ లో పేర్కొంది.
ప్రభుత్వంలోని పెద్దలకు చెల్లించిన అడ్వాన్స్ 100 కోట్లు మాత్రమే కాకుండా మరో రూ. 30 కోట్ల వరకు చెల్లించినట్టు ఈడీ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. విజయ్ నాయర్ తనకు తాను ఢిల్లీ ఎక్సైజ్ విభాగానికి చెందిన ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుంటూ ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణలో వెల్లడైంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో విజయ్ నాయర్ అన్నీ తానే అయి కీలక పాత్ర పోషించడంతో పాటు ఎక్సైజ్ పాలసీ కాపీని తమ వారికి వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేసినట్టు తేలిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ED Raids ) కస్టడీ పిటిషన్‌లో పేర్కొనడం గమనార్హం.
Also Read : Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబులకు తప్పని తిప్పలు
Also Read : Delhi Liquor Scam: బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచే ఢిల్లీ లిక్కర్ స్కామ్ క్యాష్ డీలింగ్స్ ?
Also Read : ED Raids: తెలంగాణలో సోదాలపై ఈడీ కీలక ప్రకటన.. అసలు కారణం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook