Delhi Liquor Case: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన డిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తుున్నట్టే కన్పిస్తోంది. ఈ కేసులో రేపు మంగళవారం అంటే జనవరి 16న విచారణకు హాజరుకావల్సిందిగా కోరుతూ సమన్లు జారీ చేసింది ఈడీ.
తెలంగాణ ఎన్నికలకు ముందు నుంచి నెమ్మదించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు మళ్లీ ప్రారంభమైనట్టు కన్పిస్తోంది. ఈ కేసును అటు సీబీఐ ఇటు ఈడీ రెండూ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే రెండు సార్లు విచారించింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల సమయంలో మరోసారి ఆమను విచారించేందుకు సిద్దమైంది ఈడీ. జనవరి 16న ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావల్సిందిగా సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అధికారులు కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించినప్పుడు బీఆర్ఎస్ మద్దతుగా నిలిచింది. ఇప్పుడు కవితను ఈడీ విచారించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు మద్దతిస్తుందో చూడాలి.
ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను గతంలో రెండుసార్లు ఈడీ విచారించినప్పుుడు ఆమె తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్సీ. ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఏడాదిగా జైళ్లో ఉన్నారు. బెయిల్ పిటీషన్లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook