KTR: వినూత్నంగా కేటీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. పారిశుధ్య కార్మికులతో కలిసి భోజనం

KTR New Year Celebrations: నూతన సంవత్సర వేళ పారిశుధ్య కార్మిలకులతో కలిసి భోజనం చేస్తూ.. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా తమ సమస్యలను కేటీఆర్‌ దృష్టికి వాళ్లు తీసుకువచ్చారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2024, 07:49 PM IST
KTR: వినూత్నంగా కేటీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. పారిశుధ్య కార్మికులతో కలిసి భోజనం

KTR New Year Celebrations: నూతన సంవత్సరాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వినూత్నంగా ప్రారంభించారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో ఆయన పారిశుధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ భవన్‌లో కార్మికులతో కలిసి జరుపుకుని వారితో సంభాషించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్‌తో పారిశుద్ద్య కార్మికులతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడుసార్లు శానిటరీ కార్మికులకు వేతనాలు పెంచిందన్నారు. పట్టణాలకు, పల్లెలకు అత్యంత కీలకమైన పారిశుధ్య కార్మికులకు తాము ప్రాధాన్యత ఇచ్చామని, వారికి గౌరవం పెంచెలా జీతాలు పెంచామన్నారు. 

భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు కేటీఆర్. జీహెచ్ఎంసీ పరిధిలో సమస్యలను చెబితే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి  పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఈ విషయంలో తమ పార్టీ మేయర్ విజయలక్ష్మితో సమన్వయం చేసుకోవాలన్నారు. 

పలువురు కార్మికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. జీతాల పెంపుతోపాటు, ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత కావాలన్నారు. ఇతర అవుట్ సోర్సింగ్ కార్మికుల మాదిరే తమకు కూడా ఇతర సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

నూతన సంవత్సరాన్ని సందర్భంగా కేంద్ర పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్‌ను  పలువురు నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, నగేష్, పలువరు విద్యార్ధి నాయకులు, పార్టీశ్రేణులు ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది కార్యకర్తలను కేటీఆర్ కలిశారు.

Also Read: Ys Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి ఫిబ్రవరి 17న, ప్రకటించిన వైఎస్ షర్మిల

Also Read: Redmi Note 13 Pro 5G: Redmi Note 13 సిరీస్‌ మొబైల్స్‌ల ధరేంతో తెలుసా? లీక్‌ అయిన ధర, ఫీచర్స్‌ వివరాలు! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News