ఢిల్లీ: ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్ధుల తుది జాబితా సిద్ధమైంది. తీవ్ర కసరత్తు అనంతరం తుది జాబితాతో టి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి రాహుల్ ఇంటికి వెళ్లారు. ఉత్తమ్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా, కాంగ్రెస్ ఎన్నికల స్ర్కీనింగ్ కమిటీ సభ్యుడు భక్త చరణ్ దాస్ కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ ఆమోదం తర్వాత అభ్యర్ధుల జాబితా ప్రకటించనున్నారు. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయానికి కల్లా అభ్యర్ధుల జాబితా ప్రకటించాలని కాంగ్రెస్ సన్నాహాలు చేస్తుంది
మిత్రపక్షాల డిమాండ్ కు తలొగ్గేనా ?
తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 93 స్థానాల్లో.. మహాటకూమిలోని ఇతర పార్టీలకు 26 స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో టీడీపీ 14, టీజేఎస్ 8 , సీపీఐకి 3 సీట్లు, తెలంగాణ ఇంటి పార్టీకి ఒక స్థానం కేటాయించింది. కేటాయించిన స్థానాలతో తెలంగాణ టీడీపీ సర్దుకుపోగా..టీజేఎస్,సీపీఐ మాత్రం ససేమిరా అంటున్నాయి. టీజేఎస్ తమకు 10 స్థానాలు కావాలని డిమాండ్ చేస్తుండగా.. సీపీఐ నాల్గు స్థానాలకు తగ్గకుండా ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ నిర్ణయం కోసం ఈ రెండు పార్టీలు వేచిచూస్తున్నాయి.
రెబల్స్ ను ఎలా హ్యాండిల్ చేసేను ?
టి.కాంగ్రెస్ కు రెబల్స్ భయం వెంటాడుతోంది. అభ్యర్ధులను ప్రకటించక ముందే అభ్యర్ధుల ఆందోళన బాట పట్టారు. పార్టీ ప్రధాన కార్యలయం గాంధీభవన్ వద్ద గత మూడు రోజుల నుంచి నిరసన తెలుపుతున్నారు. ఎంత ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రెబల్స్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో తుది జాబితా ప్రకటనతో రెబల్స్ మరింత రెచ్చిపోయే ప్రమాదముంది. జాబిత ప్రకటించిన మరణక్షణమే వారు తిరగుబాటు చేసే అవకాశముంది. కత్తిమీద సాములా మారిన ఈ వ్యవహాన్ని టి.కాంగ్రెస్ ఎలా చక్కబెడుతుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది
Breaking News: కొలిక్కి వచ్చిన టి.కాంగ్రెస్ అభ్యర్ధుల తుది జాబితా !