అపార్టుమెంట్​లో చెలరేగిన మంటలు..పొగలు చుట్టుముట్టి వ్యక్తి దుర్మరణం

అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌లో మంటలు చెలరేగడంతో వ్యాపించిన పొగలు చుట్టుముట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ అగ్నిప్రమాదం మేడ్చల్‌ జిల్లా మల్లాపూర్‌ గ్రీన్‌హిల్స్ కాలనీలో చోటుచేసుకుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2021, 04:09 PM IST
అపార్టుమెంట్​లో చెలరేగిన మంటలు..పొగలు చుట్టుముట్టి వ్యక్తి దుర్మరణం

Fire accident: మేడ్చల్ జిల్లా(Medchal District) మల్లాపూర్ గ్రీన్‌హిల్స్ కాలనీలోని అగ్నిప్రమాదం(Fire accident) సంభవించింది. అపార్ట్‌మెంట్‌(Apartment‌)లోని ప్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంటి మెుత్తం పొగలు(Smoke) వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్న వ్యక్తి స్పృహ కోల్పోయి..చివరకు మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలను ఆర్పివేశారు. మంటల నుంచి మరొకరిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. 

Also Read: పరుపుల గోదాంలో అగ్నిప్రమాదం..రూ.8 లక్షల ఆస్తి నష్టం..

ఇంట్లో నిల్వ ఉంచిన డీజిల్, కిరోసిన్, వైట్​నర్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మూడో అంతస్థులో మంటలు(Fire) చెలరేగిన సమయంలో... అనిల్ అనే వ్యక్తి చిక్కుకున్నాడు. ఇంట్లో మంటలు వ్యాపించగా... బాధితుడు బాత్​రూలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పొగ వల్ల అతడు స్పృహ కోల్పోయాడు. బాధితుడిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించగా..అక్కడ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇంటికి వేసే పెయింట్​లో వాడే ఆయిల్ డబ్బాలను ఇంట్లో ఉంచారని... ఇలా ఇంట్లో నిల్వ ఉంచడం చాలా ప్రమాదకరమని స్థానికులు చెబుతున్నారు. ఇళ్లలో ఇలాంటి పదార్థాలు ఉంచవద్దని పలుమార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News