Mulugu Road Accident: మేడారం రూట్‌లో విషాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ఐదుగురు దుర్మరణం!

Road accident : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2022, 01:03 PM IST
  • మేడారం జాత‌ర‌కు వెళ్తుండ‌గా రోడ్డు ప్ర‌మాదం
  • స్పాట్‌లోనే ఐదుగురు దుర్మరణం
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Mulugu Road Accident: మేడారం  రూట్‌లో విషాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ఐదుగురు దుర్మరణం!

Medaram Route Road accident : తెలంగాణ ములుగు జిల్లాలో (Mulugu District) ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్తుండగా.. గట్టమ్మ ఆలయం సమీపంలో ఈ ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతీంది. హ‌నుమ‌కొండ డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు మేడారం నుంచి తిరుగు ప్రయాణ‌మైన స‌మ‌యంలో ఈ దుర్ఘటన సంభవించింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై నుంచి కారును పక్కకు తొలగించి.. అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ప్రమాదంతో గట్టమ్మ ఆలయ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసుల ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికా కారణంగా పోలీసులు భావిస్తున్నారు. 

ఈ నెల 16న ప్రారంభమైన మేడారం జాతర (Medaram Jatara) నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. వాహానాలు ఎక్కువ సంఖ్యలో మేడారానికి వస్తుండటంతో.. రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం (ఫిబ్రవరి 17)  రాత్రి మేడారం జాతర జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం మేడారంలో ఎటు చూసినా భక్త జనసంద్రమే కనిపిస్తోంది.

Also Read: Medaram Jatara: మేడారం జాతరలో విషాదం.. తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News