France invites KTR: కేటీఆర్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం

KTR in Ambition India Business Forum: ఆంబిషన్‌ ఇండియా-2021 సదస్సులో ‘గ్రోత్‌- డ్రాఫ్టింగ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండో ఫ్రాన్స్ రిలేషన్స్‌ ఇన్‌ పోస్ట్‌ కొవిడ్‌’ అనే అంశంపై ప్రసంగించాలంటూ కేటీఆర్‌ని కోరింది ఫ్రాన్స్‌ ప్రభుత్వం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2021, 08:22 PM IST
  • తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం
  • తమ సెనెట్‌లో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌కు ఆహ్వానం పంపిన ఫ్రాన్స్ ప్రభుత్వం
  • ఈ నెల 29న ఫ్రాన్స్ సెనెట్‌లో జరిగే ఆంబిషన్‌ ఇండియా బిజినెస్‌ ఫోరం సమావేశంలో పాల్గొనాలని విజ్ఞప్తి
France invites KTR: కేటీఆర్‌కు ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం

France invites Telangana IT minister KTR to Ambition India Business Forum: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కు (KTR) మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం వచ్చింది. తమ సెనెట్‌లో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది ఫ్రాన్స్ ప్రభుత్వం. ఈ నెల 29న ఫ్రాన్స్ సెనెట్‌లో (france senate) జరిగే ఆంబిషన్‌ ఇండియా బిజినెస్‌ ఫోరం సమావేశంలో పాల్గొని ప్రసంగించాలని ఫ్రాన్స్ ప్రభుత్వం కోరింది. 

ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఇమ్మాన్యూల్‌ మాక్రోన్‌ సారథ్యంలో ఏర్పాటైన ఈ సదస్సు భారత్‌-ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తుందని కేటీఆర్‌కు (KTR) పంపిన లేఖలో ఫ్రాన్స్ గవర్నమెంట్ (Government of France) తెలిపింది.

Also Read : Edible Oil Prices: తగ్గనున్న వంటనూనెల ధరలు, బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని తొలగించిన కేంద్రం, రేపటి నుంచే అమలు

ఆంబిషన్‌ ఇండియా-2021 సదస్సులో ( Ambition India Business Forum) ‘గ్రోత్‌- డ్రాఫ్టింగ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండో ఫ్రాన్స్ రిలేషన్స్‌ ఇన్‌ పోస్ట్‌ కొవిడ్‌’ అనే అంశంపై ప్రసంగించాలంటూ కేటీఆర్‌ని కోరింది ఫ్రాన్స్‌ ప్రభుత్వం. ఆంబిషన్‌ ఇండియా-2021 సదస్సు చాలా కీలకమైనదని..ఇది తెలంగాణలో (Telangana) ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి కేటీఆర్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు. 

ఇక ఫ్రాన్స్ (France) ఆహ్వానంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ఫ్రాన్స్‌ ఆహ్వానం తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని కేటీఆర్‌ (KTR) పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను పరిచయం చేసే అవకాశం దక్కుతుందన్నారు.

Also Read : TRS state president elections : ఈ నెల 25న టీఆర్‌‌ఎస్ అధ్యక్షుడి ఎన్నిక, నవంబర్‌ 15న 'తెలంగాణ విజయ గర్జన'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News