Free COVID19 Tests In GHMC | తెలంగాణలో రోజురోజుకూ కరోనా వైరస్ (CoronaVirus) పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్, దాని పరిసర ప్రాంత జిల్లాల్లో కోవిడ్19 కేసులు అధికంగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ (GHMC) సహ పరిసర మేడ్చల్, రంగారెడ్డి ప్రాంతాల్లో ఉచిత కరోనా వైరస్ టెస్టులు ప్రారంభించింది. జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కనీసం 50వేల కోవిడ్19 టెస్టులు జరపాలని తెలంగాణ సర్కార్ ప్రకటించడం తెలిసిందే. అవసరమైతే అంతకంటే ఎక్కువ టెస్టులు సైతం చేస్తామని వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం స్పష్టం చేశారు. TIMSలో ఉద్యోగాలు.. మూడు రోజులే గడువు
కొండాపూర్, వనస్థలిపురం, సరూర్‌నగర్ తదితర హాస్పిటల్స్‌లో నేటి నుంచి ఉచిత కరోనా వైరస్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే గతంలో పాజిటివ్ కేసులు నమోదైన వారి కుటుంబసభ్యులు, ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులకు, కరోనా లక్షణాలున్న వారికి మొదటగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కోవిడ్19 పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ