Free Internet in Hyderabad: ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. ఉచితంగా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ డేటా!

హైదరాబాదీయులకు నిజంగా ఇది గుడ్ న్యూస్... ఉచితంగా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ డేటా.. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్.. అందరకి కాదండోయ్... "యాక్ట్" యూసర్లకు మాత్రమే.. ఎందుకో మీరే చూడండి!  

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2021, 06:40 PM IST
  • హైదరాబాద్ లో అన్ లిమిటెడ్ ఫ్రీ ఇంటర్నెట్
  • ఇంట్లోంచి బయటకి వస్తే చాలు ఫ్రీగా ఇంటర్నెట్
  • ఇక తరువాత వరంగల్ జిల్లా లో ప్రారంభం...
Free Internet in Hyderabad: ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. ఉచితంగా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ డేటా!

ఈ రోజుల్లో అంతట ఇంటర్నెట్ హవా... ప్రపంచమంతా ఇప్పుడు ఇంటర్నెట్ (Internet) చుట్టూ తిరుగుతోంది.  చిన్న చిన్న పట్టణాలు, పల్లెల్లో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి. ఇక నగరాల్లో అయితే దాదాపుగా ప్రతీ ఇంటికి కూడా వైఫై (Wifi)తప్పనిసరి అయ్యింది. ఇంట్లో ఇంటర్నెట్ ఉంటేనే.. చాలామంది కంఫర్ట్‌గా ఫీలవుతున్నారు.

ప్రజలే కాదు... బిజినెస్ (Business), మీడియా (Media), ప్రభుత్వ వెబ్‌సైట్లు (Governament Websites) కూడా చాలా వరకు ఇంటర్నెట్ మీదే ఆధారపడుతున్నాయి. దీంతో ఇంటర్నెట్ అనేది ప్రతీ ఒక్కరి లైఫ్‌లో తప్పనిసరి అయ్యింది. ఇంట్లో వైఫై (Home Wifi) లేదంటే.. ఫోన్లో డేటా (Phone data)ఉండకపోతే.. ఏం తోచని పరిస్థితి నెలకొంది. రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా రకరకాల ఆఫర్లతో ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. తక్కువ ధరకు ఎక్కువ డేటా అందిస్తామంటూ పోటీ పడుతున్నాయి. అటు నెటిజన్లు కూడా నెట్ కోసం ఎంత కాస్ట్ అయినా చెల్లిస్తున్నారు. ఎంత రీఛార్జ్ అయినా సరే చేసుకుంటూ పోతున్నారు. 

Also Read: Tuck Jagadish: అమెజాన్ ప్రైమ్‌లో నాని 'టక్ జగదీష్'...! స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!

ఇక కరోనా వైరస్ (Corona Viruis) వల్ల విధించిన లాక్ డౌన్ (Lock down) సమయంలో ఇంటర్నెట్ కీలక పాత్ర పోషించింది. యాక్ట్ ఫైబర్ నెట్ (ACT fiber Internet) వంటి సర్వీస్ ప్రొవైడర్లు తమ సేవల్ని నిరంతరాయంగా అందించడంతో చాలా వరకు జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి దగ్గర ఉంటూ.. ఓటీటీలో విడుదలైన సినిమాలను చూస్తూ కాలక్షేపం చేశారు.

ఇక కొందరు ఆన్ లైన్‌లో గేమ్‌లు (Online games) ఆడుతూ టైమ్ పాస్ చేశారు. ఇవన్నీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అందించిన సేవల వల్లే సాధ్యం అయ్యింది. ఇక కోవిడ్ కారణంగా గత ఏడాదిగా చాలా కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అందించాయి. దీంతో చాలామంది ఇంటిలోనే ఆఫీసు తెరిచారు. వైఫై పెట్టుకొని ఇంటర్నెట్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. 

Also Read: Sonu Sood: 'దేశ్ కే మెంటర్స్' బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్...సీఎం కేజ్రీవాల్ ప్రకటన

అయితే తాజాగా ప్రముఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యాక్ట్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది.  యాక్ట్ స్మార్ట్ ఫైబర్ టెక్నాలజీ (ACT Fibernet Technology) సాయంతో ఇంటి బయట కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తోంది యాక్ట్. ఇంటి నుంచి బయటకు వెళ్లినా సరే... అదే ప్లాన్‌తో నెట్‌ను వాడుకునేలా అవకాశం కల్పించింది. దీని కోసం సిటీలో పలు చోట్ల ఫ్రీ వైఫై జోన్లను (Free WiFi Zones) ఏర్పాటు చేసింది యాక్ట్.  స్మార్ట్‌ పైబర్‌ టెక్నాలజీ సాయంతో తన వినియోదారులకు ఇంటి బయట కూడా ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తోంది. ఇళ్లు లేదా ఆఫీస్‌ దగ్గర ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఏ ప్లాన్‌లో ఉందో అదే ప్లాన్‌తో హై-ఫైలో ఏర్పాటు చేసిన ఫ్రీ వైఫై జోన్ల దగ్గర కూడా నెట్‌ను వాడుకునేలా తన వినియోగదారులకు అవకాశం కల్పించింది. 

నగరంలో యాక్ట్ ఏర్పాటు చేసిన ఫ్రీ వైఫై సెంటర్ల వద్ద సాధారణ యూజర్లకు కేవలం 25 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తోనే నెట్ అందుతుంది. అంతేకాదు కేవలం 45 నిమిషాల పాటే నెట్‌ వాడుకునే ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో యాక్ట్ యూజర్లకు మాత్రం వారి ఇంటి దగ్గర ప్లాన్‌ ప్రకారం ఎక్కువ స్పీడ్‌తో ఎంత సేపైనా అన్‌లిమిటెడ్‌గా నెట్‌ను వాడుకునే వెసుల బాటు కల్పించింది యాక్ట్. హైదరాబాద్‌ మెట్రో (Hyderabad Metro) పరిధిలో ఉన్న 47 స్టేషన్లలో కూడా ఈ నెట్‌ సౌక్యర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

Also Read: Bigg Boss OTT: బిగ్‌బాస్ హౌస్ లోఉన్న హాట్ భామల పారితోషికాలు ఎంతో తెలుసా..??

ఇక హైదరాబాద్‌ (Hyderabad) తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్‌లోనూ (Warangal) ఈ ఉచిత వైఫై సదుపాయాన్ని ప్రారంభించినట్లు యాక్ట్‌ సంస్థ వెల్లడించింది. మొత్తం మీద యాక్ట్ అందిస్తోన్న ఈ ఉచిత వైఫైతో యాక్ట్ వినియోగదారులతో పాటు.. ఇతర యూజర్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News