TSRTC offers 10% discount on Hyderabad to Vijayawada bus routes: వేసవి సెలవులతోపాటు ఎన్నికలు కూడా ఉండటంతో ప్రజలు తమ సొంతూళ్లుకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్ అన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఆర్టీసీ.. ప్యాసింజర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి వెళ్లే వారికి భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. టికెట్ పై 10 శాతం రాయితీని ఇవ్వనుంది. ఈ ఆఫర్ తిరుగు ప్రయాణానికి కూడా వర్తిస్తుందని ఆర్టీసీ తెలిపింది.
సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్ ఎప్పుడు బిజీ బిజీగానే ఉంటుంది. రోజూ ఈ రూట్ లో వేల సంఖ్యలో ప్రజలు ట్రావెల్ చేస్తుంటారు. ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు ఎక్కువగా లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా వారు భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల భారం తగ్గించడానికి అధిక సంఖ్యలో బస్సులు నడపడంతో పాటు డిస్కౌంట్ ను ప్రకటించింది.
Also Read: KTR Challenge: 'లంగలకు పెత్తనం ఇస్తే నెత్తి మీద పెత్తనం చేస్తారు' మోదీ, రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు
పది నిమిషాలకు ఒక బస్సు..
తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా హైదరాబాద్-విజయవాడ రూట్ లో ఒక్కో ప్రయాణికుడిపై రూ.100 ఆదా కానుంది. అంతేకాకుండా ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు నడపనుంది. ఈ మార్గంలో రోజూ 120కిపైగా బస్సులు తిప్పనున్నారు. ఇందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులు ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలనుకునేవారు టీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.inని సంప్రదించండి.
హైదరాబాద్-విజయవాడ రూట్ లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును #TSRTC అందుబాటులో ఉంచింది. ఆ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోంది. అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62… pic.twitter.com/nvG8kzoaRH
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 27, 2024
Also Read: Revanth Fake Video: 'ఇప్పుడు రాలేను.. 4 వారాల టైం కావాలి' ఢిల్లీ పోలీసులకు రేవంత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter