గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన యాంకర్ శ్రీముఖి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన యాంకర్ శ్రీముఖితో పాటు పలువురు ఫోటో జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో మంచి కార్యక్రమం అన్నారు. ఇందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. నేడు నగరంలోని జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు.

Last Updated : Jan 3, 2020, 07:44 PM IST
గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన యాంకర్ శ్రీముఖి

హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన యాంకర్ శ్రీముఖితో పాటు పలువురు ఫోటో జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో మంచి కార్యక్రమం'' అని అన్నారు. ఇందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.  నేడు నగరంలోని జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు.  వాతావరణ కాలుష్యం వల్ల చాలా మంది వారి పిల్లలను ఇతర దేశాలకు తీసుకెళ్లి అక్కడే స్థిరపడదామనే ఆలోచనలో ఉంటున్నారని ఆమె అన్నారు.

అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే అందరం కలిసి మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తన వంతుగా మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెజ్‌ను విసురుతున్నట్లు తెలిపారు. వితిక, జానీ మాస్టర్, యాంకర్ రష్మిలను మొక్కలు నాటాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.
 

Trending News