Heavy Rains: వచ్చే 3 రోజులు తెలంగాణలో కుండపోత వానలు..

Heavy Rains: తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజులు ఉరుములు మెరుపులతోపాటు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 24, 2024, 11:03 AM IST
Heavy Rains: వచ్చే 3 రోజులు తెలంగాణలో కుండపోత వానలు..

Heavy Rains: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం, దక్షిణ కోస్తా మయన్మార్‌లోని ఉపరితల ఆవర్తనం తూర్పు, పశ్చిమ ద్రోణితో కలిసిపోయి.. సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇది   నైరుతి దిశగా వంగి ఉంటుందని, దీని ప్రభావంతో రాగల 24గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

ఈ రోజు   మహబూబాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నిర్మల్‌, నిజామాబాద్‌, నల్గొండ, సూర్యాపేట, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.  కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలుపడే అవకాశం ఉందని హెచ్చరించింది.

రేపు మంచిర్యాల, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ,పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.  ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.
*
ఇలా వుండగా హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం నుంచి  వర్షం దంచికొట్టింది. రెండు గంటల్లో నాలుగు సెంటీమీటర్ల వాన పడింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎల్బీనగర్, నాగోలు, చైతన్యపురి, అల్కాపురి, చింతలకుంట, దిల్ సుఖ్ నగర్, సరూర్ ​నగర్, హయత్ నగర్, మల్కాజిగిరిలో భారీ వర్షం కురిసింది. చాలాచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే సమయం కావడంతో ప్రజలు తీవ్ర  ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నరక యాతన అనుభవించారు.  వాన అర్థరాత్రి వరకూ కొనసాగింది. అత్యధికంగా సరూర్ నగర్, నాగోలు​లో 4.70 సెంటీమీటర్ల వర్షం పడింది. వానల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు.

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!

ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News