Heavy Rains In Telangana: రేపు 11 జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ..

Heavy Rains In Telangana:  తెలంగాణకు వరుణ దేవుడు ఒదిలిపెట్టడం లేదు. గత నాలుగు రోజులుగా తెలంగాణను వర్షాలు ముంచెత్తడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్క బిక్కు మంటూ జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఈ రోజు,  రేపు తెలంగాణలో 11 జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 3, 2024, 07:49 AM IST
 Heavy Rains In Telangana: రేపు 11 జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ..

Heavy Rains In Telangana:  తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. మధ్యలో కాస్త తెరిపి ఇచ్చినట్టు కనిపించిన ముసురు ఒదలడం లేదు.ముఖ్యంగా తెలంగాణలోని ఎన్నడు లేనట్టుగా రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మున్నేరు డ్యామ్ కు గండి పడటంతో ప్రజలు రెండు రోజులుగా వరద నీటిలో చిక్కుకు పోయారు. ప్రభుత్వం సహాయ పునరావాస చర్యలు అన్ని వర్గాల ప్రజలకు చేరడం లేదు. ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, కుంటలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణలో మానుకోటలోని కే సముద్రం దగ్గర పట్టాల కింద మట్టి కొట్టుకోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు హైదరాబాద్ - విజయవాడ రహదారిపై కూడా వరద పోటెత్తడంతో ఒక రోజు  ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారులు వెంటనే యుద్ధ ప్రాతికదిన చర్యలు చేపడుతున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ లో భారీ వర్షాలు పడిన పెద్దగా వరద ముప్పు ఏర్పడలేదు. కానీ ఖమ్మంతో పాటు కొన్ని జిల్లాల్లో సమీపంలోని కుంటలు, చెరువుల కట్ట తెగడంతో ఆ సమీపంలోని కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. మరోవైపు  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. ఇవాళ , రేపు తెలంగాణలోని 11 జిల్లాలో భారీ వర్షాల కురిసే ఛాన్సెస్ ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, ఆదిలాబాద్, జనగాం,జయ శంకర్ భూపాలపల్లి, భద్రాచలం, కొమరం భీమ్ ఆసిఫాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. భారీ వర్షాల నేపథ్యంవల్ల కొన్ని చోట్ల పాత ఇళ్లు  కూలిపోయాయి.  మరోవైపు వర్షాల నేపథ్యంలో జిల్లాల వారీగా కంట్రోల్ ఏర్పాటు చేసారు.  భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో  ప్రభుత్వం అన్ని శాఖలను  అప్రమత్తం చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా వరద ముంపు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేశారు. మరోవైపు వరద తగ్గుముఖం పట్టడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తున్నారు. మరోవైపు వరదుల, కరెంట్ లేకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. అంతేకాదు వరదల నేపథ్యంలో తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. తెలంగాణ సీఎస్ శాంతి కుమారి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతేకాదు అత్యవసర సర్వీసుల వారి సెలవులను రద్దు చేశారు. వెంటనే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కేంద్రం కూడా వెంటనే స్పందించి వరద ముంపు ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాలో పరిస్థితులను బట్టి స్కూల్లు, కాలేజీలకు సెలవులకు ప్రకటించేంకు కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News